పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలోని సుప్రసిద్ధ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్నిశనివారం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News