Breaking News

Daily Archives: July 2, 2024

రూ. 100 కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు వెర్మీరియ‌న్ కంపెనీ సిద్ధం.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయ్య‌క పారిశ్రామిక‌వేత్త‌ల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చింద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వెర్మీరియ‌న్ కంపెనీ ప్ర‌తినిధులు మంత్రి టి.జి భ‌ర‌త్‌తో స‌మావేశ‌మ‌య్యారు. శ్రీసిటీలో ఉన్న వెర్మీరియ‌న్ కంపెనీ యూనిట్‌ను విస్త‌రించేందుకు మంత్రితో చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌మావేశం అనంత‌రం మంత్రి మాట్లాడుతూ రూ. 100 కోట్ల‌తో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వెర్మీరియ‌న్ కంపెనీ సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. …

Read More »

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలు పునఃప్రారంభం..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గన్నవరం ఎయిర్‌పోర్టులో కార్గో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సేవలు అందబాటులోకి వచ్చాయని.. అందరూ ఉపయోగించుకోవాలని విమానాశ్రయం అధికారులు తెలిపారు. రాబోయే అంతర్జాతీయ సర్వీస్ (కార్గో కోసం) నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి 2021లోనే కార్గో సేవలు ప్రారంభంకావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇప్పటికి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గన్నవరం ఎయిర్ పోర్టులో ఒమేగా కంపెనీ కార్గో సర్వీసును పునరుద్ధరించడం అభినందనీయం అని గన్నవరం ఎయిర్ పోర్ట్ …

Read More »

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కార్తికేయ మిశ్రా

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఐఏఎస్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈవో కె ఎస్ రామరావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .

Read More »

ఊరూరా మీసేవ….!

-మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు -ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాళ్ల ఎంపిక -ఒక్కో కేంద్రానికి రూ.2.50 లక్షల రుణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది. పంద్రాగస్టు నాటికి …

Read More »

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో సహాయ పడుతుందన్నారు.

Read More »

నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట

-పకడ్బందీగా స్కిల్ సెన్సెస్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు -స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కిల్ …

Read More »

విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా మెగా డిఎస్సీ

-న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకెళదాం -పాఠశాలల్లో అకడమిక్ కేలండర్ రూపకల్పనకు ఆదేశం -టెట్, మెగా డీఎస్సీపై సమీక్షలో విద్య, ఐటి మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ …

Read More »

ప్రకృతి ని రక్షించేది…పచ్చదనమే

-బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు లో భాగంగా ..అమ్మ పేరు తో ఒక మొక్క అనే కార్యక్రమం చేపట్టిన బిజెపి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద మొక్క నాటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర ప్రధాన సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ …

Read More »

ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ 2024-25: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

-నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులు జులై 2 (మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. జులై 10 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. జూలై 4వ తేదీ నుంచి ఆరో తేదీ వరకు స్పెషల్ క్యాటగిరీ విద్యార్ధులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ …

Read More »

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి

-జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి -నూతన ఇసుక విధానం, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక -రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలి -పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి..అధికారులు వేగంగా పని చేయాలి :- సమీక్షలో సిఎం నారా చంద్రబాబు నాయుడు -ఇసుక, రోడ్లు, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై మంత్రులు, అధికారులతో సచివాలయంలో వరుసగా సిఎం సమీక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక …

Read More »