Breaking News

Daily Archives: July 2, 2024

ప్రవేటు స్కూల్ నీ తనిఖీ చేసిన ఆర్డీఓ చైత్ర వర్షిణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఫ్రీ సీటు లలో ప్రైవేటు పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు అక్కడ అందచేస్తున్న విద్యా బోధన విధానాన్ని పరిశీలించడం జరిగిందని రాజమండ్రీ రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక లిట్టిల్ ప్యారడైజ్ స్కూల్ ను జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు , ఇతర అధికారులతో కలసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆర్డీఓ చైత్ర వర్షిణి మిగిలిన విద్యార్థుల తో పాటుగా ఉచిత …

Read More »

ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు ఈ మేరకు సిఎండి, ఏపీఈపీడీసీఎల్ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆదేశాలు జారీ చేసినట్లు ఏ.పి.ఇ.పి.డి.సి.యల్: ఆపరేషన్ సర్కిల్ రాజమహేంద్రవరం పర్యవేక్షక ఇంజనీరు టీవీఎస్ఎన్ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) వినియోగదారులు సౌలభ్యం కోసం విద్యుత్ బిల్లులను ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి …

Read More »

డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం గా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి  కృషి చేస్తోంది -డయేరియా  ప్రభలకుండా  నియంత్రణే లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు  చేపట్టింది -కోటిలింగాల రేవు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజలకు సూచనలు ఇస్తున్న శాసనసభ్యులు -డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి -అవసరం మేరకు వైద్యుని సంప్రదించి మందులు వాడాలి -రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో …

Read More »

ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం

-ఐటీ రీఫండ్‌కు ఈ ఏడాది అదనపు సమయం -ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా పరిశీలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ రీఫండ్‌కు ఈ ఏడాది సమయం పడుతుంది. ఈ సంవత్సరం, వారు చాలా కఠినంగా రిటర్న్‌లను పరిశీలించబోతున్నారు. దీని కోసం వారు దాఖలు చేసిన ITRలను పరిశీలించడానికి ప్రత్యేకంగా రూపొందించిన, స్వీయ ఆటోమేటెడ్ మరియు సవరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ (AI)ని స్వీకరించారు. ఈ ప్రోగ్రామ్ మొదట మీ పాన్ కార్డ్‌తో లింక్ చేయబడిన డేటాను సేకరిస్తుంది, ఆపై …

Read More »

తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కదిలిన యంత్రాంగం -భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక దృష్టి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు… చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవ లేదంటారు పెద్దలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్  ఎంత గొంతు చించుకున్నా ప్రభుత్వంలో చలనం రాలేదు. కనీసం …

Read More »

ప్రధాని నరేంద్ర మోదీ తో జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు సమావేశం

-రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్ కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో టూరిజం …

Read More »

వైసీపీ పాలనలో గ్రామాల నుంచి నిధులు మళ్లింపు తప్పితే ఇచ్చింది లేదు

-నిధులు, పథకాలు, రావాల్సిన వాటాలపై హై లెవెల్ కమిటీలో చర్చిస్తాం -ఆర్థిక బలంతోనే పంచాయతీల్లో అభివృద్ధి -ఆడ బిడ్డల అదృశ్యం మీద ప్రత్యేక సెల్ ఏర్పాటుపై దృష్టి -గత ప్రభుత్వం ఆడబిడ్డలు అదృశ్యంపై అసలు పట్టించుకోలేదు -జల్ జీవన్ మిషన్ నిధులతో రాష్ట్రమంతటా తాగు నీరు అందిస్తాం -కాలుష్యరహిత పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం -కాకినాడ జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలన్నీ …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్  నామినేషన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు, గిడ్డి సత్యనారాయణ, వర ప్రసాద్ తదితరులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి ఎమ్. విజయరాజుకి …

Read More »

ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఈ నెల 8న విజయవాడ CK కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరగనున్నాయి. YSR గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి, ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలు, ఏపి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు, …

Read More »

విలువ‌ల‌తో కూడిన విద్యతోనే విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ధి

– వ‌సతి గృహాల విద్యార్థుల‌ను ఉజ్వ‌ల కెరీర్ దిశ‌గా న‌డిపించాలి – ప్ర‌త్యేక స‌హ పాఠ్య కార్య‌క్ర‌మాలను ప్ర‌ణాళిక ప్ర‌కారం అమ‌లుచేయాలి – అధికారుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌స‌తి గృహాల్లో ఉండి చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు విలువ‌ల‌తో కూడిన విద్య అందేలా చూడ‌టంతో పాటు భ‌విష్య‌త్తులో ఉన్న‌త కెరీర్‌ను సొంతం చేసుకునే దిశ‌గా వారిని న‌డిపించాల‌ని.. ఇందుకు షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌త్యేక స‌హ‌పాఠ్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం …

Read More »