Breaking News

Daily Archives: July 12, 2024

మధ్యాహ్న భోజనం మెనూ అమల్లో ప్రత్యేక శ్రద్ధ

-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ 10వ తరగతి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నాటు. సబ్జెక్టు బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో …

Read More »

మంత్రి పార్థసారథిని మర్యాద పూర్వకంగా కలిసిన డైరెక్టర్ హిమాన్షు శుక్ల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార శాఖ సంచాలకులు గా నియమితులైన హిమాన్షు శుక్ల శుక్రవారం విజయవాడ కమీషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తాడిగడపలోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థ సారథిని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.

Read More »

వ్యవసాయ అనుబంధ రంగాల్లో పూర్వవైభవాన్ని తీసుకువస్తాం

-రైతులు ఆత్మగౌరవంతో తలెత్తకు జీవించేందుకు అవసరమైన అన్నిరకాలచర్యలు చేపడతాం -అందుకే ఆరు ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేశాము -రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు,సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి -ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుండి “పొలంపిలుస్తోంది” కార్యక్రమం -వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన అన్ని రకాల పరికరాలను, పనిముట్లను రైతులకు అందజేస్తాం -మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులను లాక్కునే 144 & 217 జీఓలను రద్దుచేస్తున్నాం -మత్స్యకారులకు అందజేసే డీజిల్ రాయితీ పథకాన్ని పునరుద్దరిస్తున్నాం, అందుకు …

Read More »

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

-హిమాన్షు శుక్లా, డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. జర్నలిస్ట్ హెల్త్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా

-2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా -హిమాన్షు శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఐ అండ్ పీఆర్ అధికారులు -పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది -గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు -సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా -సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో తనదైన ముద్ర వేసిన హిమాన్షు శుక్లా అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా …

Read More »

ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు.. మంత్రి టి.జి భ‌ర‌త్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సీఎం చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. రాష్ట్రానికి పెట్ట‌బడులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. విశాఖ‌ప‌ట్నంలోని నోవోటెల్ హోట‌ల్‌లో ఆయ‌న పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార ప్ర‌ముఖులు, సీఐఐ స‌భ్యులతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని పారిశ్రామిక‌వేత్త‌ల‌ను కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మెరుగైన రాయితీలు ఇవ్వ‌డంతో పాటు ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు ముందుంటామ‌న్నారు. వ్యాపారాన్ని …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి

-తీర ప్రాంత నిర్వహణపై ఎన్.సి.సి.ఆర్. రూపొందించిన ప్రణాళిక విడుదల చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -తీర ప్రాంత నిర్వహణకు ఎన్.సి.సి.ఆర్., ఏపీసీజడ్ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి 973 కి.మీ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం… తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత అనే ఆందోళన కలిగిస్తోందని, కోత ప్రమాదాన్ని నివారించేoదుకు ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్నారు. …

Read More »

వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు…కాంట్రాక్టర్లకు బిల్లులూ ఇవ్వలేదు

-గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు -గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం -ఆర్ అండ్ బి సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు -అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం -రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై అధికారులు, ఐఐటి ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, దీంతో వాహనదారులు, ప్రజలు …

Read More »

వ్యర్థాలతో సంపద సృష్టిని శాస్త్రీయంగా చేపట్టాలి

-ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి -మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఆసక్తి ఉన్నవారికి శిక్షణ -ఏడాదికి రూ.2643 కోట్లు సంపాదన… 2.45 లక్షల మందికి ఉపాధి -మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి… నా ఆఫీసు, క్యాంపు కార్యాలయం, నా నియోజకవర్గం నుంచే మొదలుపెడదాం -పంచాయతీలను గత పాలకులు నిర్వీర్యం చేశారు -స్వయం సమృద్దిగా ఎదిగేలా పంచాయతీలను తీర్చిదిద్దుతాం -పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప …

Read More »

కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారుదిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు …

Read More »