Breaking News

Daily Archives: July 17, 2024

వాసవ్య మహిళా మండలి, కృష్ణా & ఎన్టీఆర్ జిల్లాల్లో 47 బాల్య వివాహాలను అడ్డుకుంది

-వాసవ్య మహిళా మండలి మే 2023 నుండి ఇప్పటి వరకు 47 బాల్య వివాహాలను నిరోధిస్తుందని భారతదేశ చైల్డ్ ప్రొటెక్షన్ నివేదిక అస్సాంలో చూసినట్లుగా బాల్య వివాహాలను అంతం చేయడానికి ప్రాసిక్యూషన్ కీని వెల్లడించింది -ప్రస్తుత రేటు ప్రకారం, బాల్య వివాహాల కేసులను క్లియర్ చేయడానికి భారతదేశం 19 సంవత్సరాలు పట్టవచ్చని నివేదిక వెల్లడించింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో బాల్య వివాహాలను అంతం చేయడంలో చట్టపరమైన చర్యలు మరియు ప్రాసిక్యూషన్ యొక్క స్థితి మరియు పాత్రను హైలైట్ చేసే నివేదికలోని …

Read More »

కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేసిన ఎస్పీ నరసింహ కిషోర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వారిని స్ధానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన డి. నరసింహ కిషోర్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందచేసారు. జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన నరసింహ కిషోర్ ను కలెక్టర్ అభినందించారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, తదితర పలు అంశాల పై చర్చించడం జరిగింది.

Read More »

వృద్ధాశ్రమానికి సందర్శించిన కలెక్టర్ ప్రశాంతి

-మానవీయ విలువలు కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత -వృద్ధులు, అనాథ పిల్లల పట్ల మానవత్వం కలిగి ఉండాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఆధునిక కాలంలో మానవ విలువలు అంతరించి పోతున్నాయని, నేటి ఆధునిక సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతోందని, వాటి నిర్వహణా విషయంలో తగినజాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం నారాయణపురం లో ఉన్న శ్రీ గౌతమీ జీవ కారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులతో మాట్లాడడం జరిగింది. …

Read More »

నగరంలో విస్తృత స్థాయిలో పర్యటించిన కలెక్టర్ ప్రశాంతి

-గౌతమి గ్రంథాలయం, టౌన్ హాల్, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ సందర్శన -స్ధానిక దర్శనీయ స్థలాలు, వాటి విశిష్టత పై పరిశీలన -వాటికీ పూర్వ వైభవం కోసం కృషి చెయ్యాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లో గుర్తింపు పొందిన, బహుళ ప్రాచుర్యం కలిగిన ప్రదేశాలను సందర్శించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వాటి ప్రాశిస్థానికి తగిన గుర్తింపు కోసం కృషి చెయ్యడం జరుగుతుందని తెలిపారు. బుధవారం నగరంలోని గౌతమి గ్రంథాలయం, టౌన్ హాల్, దామెర్ల ఆర్ట్ …

Read More »

“ఏకలవ్య జయంతి”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఏకలవ్య జయంతి” సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ ప్రకాష్ నగర్ చేపల మార్కెట్, ఎరుకుల సంక్షేమ సంఘం కూతాడి నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం ఏకలవ్య విగ్రహం వద్ద  ఏకలవ్య జయంతి వేడుకలు నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ,టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముందుగా ఏకలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వృద్దులకు, మహిళలకు చీరలు పంపిణీ చేసి కేక్ కట్ చేయడం జరిగినది. అనంతరం …

Read More »

ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది… : బోండా ఉమా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈరోజు తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ…..ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని ఈ అక్రమాలు దోపిడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. అని చెప్పారు. వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు చేశారో, ఏంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడుతున్నాం అనీ అన్నారు ఐదేళ్ల …

Read More »

నల్ల హనుమంతుడు ఆలయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముని పరమ భక్తుడు హనుమంతుడు. పురాణాల ప్రకారం హనుమంతుడు తనకు శ్రీరామునిపై తన భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తన శరీరాన్ని సింధురంతో నింపుకున్నాడు. చిరంజీవి అయిన హనుమంతుడు కలియుగంలో తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే ఆ సేతు హిమాచలం ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. చిన్న చిన్న గల్లీ నుంచి భారీ విగ్రహాలు దర్శనం ఇస్తాయి. అయితే ఒక ప్రాంతంలో మాత్రం హనుమంతుడు నల్లని రూపంలో దర్శనం ఇస్తాడు. దీని సంబంధించిన పురాణం కథ కూడా ఉంది. …

Read More »

ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసిన ప్రభుత్వం… : మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో డయేరియా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క నెలలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి అని తెలియజేశారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలు ముందుగా గుర్తించకపోవడం, డయేరియా ప్రభావిత ప్రాంతాలలో తగు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో …

Read More »

కోటి తీర్థాల పుణ్య‌ఫ‌లం.. తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశినే శయనైకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ”గోపద్మ వ్రతం” ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు …

Read More »

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వుల జారీ సంతోషకరం సీఎం రేవంత్ రెడ్డికి, అధికారులకు అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను.  తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై  తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా.అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి …

Read More »