Breaking News

Daily Archives: July 18, 2024

ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-అధిక వర్షాల నేపథ్యంలో ఎంపీ పురందేశ్వరి సూచన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి గురువారం ఒక ప్రకటనలో సూచనలు చేసారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినందున అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వర్షంలో బయట ఎక్కువగా తిరగవద్దని కోరారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని …

Read More »

అధిక వర్షాలు నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-వరదలు వచ్చే అవకాశం నేపధ్యంలో అత్యవసర సేవలకై సన్నద్ధంగా ఉండాలి -మండల ప్రత్యేక అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి -సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి -క్షేత్ర స్థాయిలో బలహీనంగా ఉన్న బండ్ లని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలి -అత్యవసర మందులు, నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలి -పునరావాస కేంద్రాలను సన్నద్ధంగా ఉంచుకోవాలి, – పరిస్థితులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పన ఉండాలి -జిల్లా, డివిజన్ స్థాయి 24 X 7 కంట్రోల్ రూం లు ఏర్పాటు -కంట్రోల్ రూం …

Read More »

అందుబాటులో విద్యుత్తు సమస్యలను పరిష్కారం చేసే దిశలో 24 X 7 సిబ్బంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం వర్షాలు మరియు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్ష సూచన మేరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ ఎపిఈపి డిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టీ వీ ఎస్ ఎన్ మూర్తి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియ చేశారు. విద్యుత్తు సమస్యలను పరిష్కారం చేసే దిశలో 24 X 7 సిబ్బంది అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు . జిల్లా కలెక్టర్ …

Read More »

పన్నులు వసూళ్లలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి

-కడియం, రాజమండ్రి రూరల్ ఎంపిడివో, మేజర్ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ లు ఆదాయ వనరులను పెంపొందించే దిశలో మరింత గా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా , డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, ప్రత్యేక అధికారులు , ఎంపిడివో లు, మేజర్ పంచాయతీ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి …

Read More »

ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 10అడుగులకు నీటిమట్టం..

తూర్పుగోదావరి, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు సీలేరు నీరుతోడై ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10అడుగులకు చేరింది. గత మూడు రోజులుగా 9.5 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటిమట్టం గురువారం పెరిగింది. ఇన్ ప్లో 1.53లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ప్లో 1.43లక్షల క్యూసెక్కులు ఉంది. పంట కాలువలు ద్వారా 8,700క్యూసెక్కుల సాగినీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More »

హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

-వారం వారం ఇండ్ల నిర్మాణాలకు జరిపే మెటీరియల్ కేటాయింపుల ప్రగతిపై సమీక్షా చేస్తా -నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో అభివృద్ది పనుల పర్యవేక్షణా కు పంపుతాను -కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇండ్ల నిర్మాణాలకు జరిగే మెటీరియల్ కేటాయింపుల వివరాలపై వారం వారం సమీక్ష నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు పి. ప్రశాంతి …

Read More »

ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల పై సమీక్ష

-జూలై 20 న ఓటింగు, జూలై 21 కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి -శాంతి భద్రతలు నేపధ్యంలో 144 సెక్షన్ అమలు -ఓటు హక్కును 54 పోలింగు కేంద్రాలలో వినియోగించుకోనున్న 74,585 మంది ఓటర్లు -జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల పొలింగు, కౌంటింగ్ ఏర్పాట్లు పై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రశాంతి కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించి దిశా …

Read More »

జూలై 20న ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా..!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదీన అనగా శనివారం నాడు ఓల్డ్ రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న శ్రీ పట్టాభి మెమోరియల్ ట్రైనింగ్ సెంటర్ – ఆర్ఎస్ఈటీఐ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) నందు జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ …

Read More »

22 వరకు ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ వారి ఎక్సిబిషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ రిబ్బన్ కట్ చేశారు ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ వారి ఆధ్వర్యం లో గత మూడు సంవత్స రాలుగా ఏర్పాటు చేయడం జరిగినది మొట్ట మొదటిసారిగా విజయవా డ సిటీలో బందర్ రోడ్ ఏ కన్వెన్షన్ హాల్లో 14 రాష్ట్రాల నుంచి విధానమైన రకాల మాన్యువల్ సిల్క్ హ్యాండ్లూమ్ సిల్క్ బెనారస్ చందేరిజ్ కాంచీపురం బెంగాలీ క్రేప్ ఉప్పాడ జిందల్స్ …

Read More »

షార్జా ప్రభుత్వ అధికారులను సత్కరించిన డాక్టర్ కాకాని తరుణ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : షార్జా ప్రభుత్వం ద్వారా షార్జా విమానాశ్రయ అంతర్జాతీయ ఫ్రీ జోన్ (SAIF) అథారిటీ ద్వారా విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మూడు రోజుల బిజినెస్ నెట్‌వర్కింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. SAIF జోన్ సేల్స్ డిప్యూటీ డైరెక్టర్ అలీ అల్ ముతావా మరియు SAIF సేల్స్ ఎగ్జిక్యూటివ్ షోయెబ్ ఇబ్రహీం ఖతీబ్ షార్జా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఫోరమ్ యొక్క కార్యనిర్వాహక విభాగం, SAIF జోన్ బృందంతో సమావేశమై, షార్జాలోని ఆంధ్ర ప్రదేశ్ నుండి పారిశ్రామికవేత్తలకు …

Read More »