Breaking News

Daily Archives: July 18, 2024

విజయవాడ నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన నరసింహ మూర్తి కి సెండ్ ఆఫ్ ఇచ్చిన వి ఎం సి సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్గా గత ఆరు ఏలు విధులు నిర్వహించిన కె నరసింహమూర్తికీ పేరెంట్ డిపార్ట్మెంట్ కి బదిలీ వచ్చినందున, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు కే నరసింహమూర్తి గారికి సెండ్ ఆఫ్ సభను నిర్వహిస్తూ నూతన అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ మూర్తి గారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ ఎకౌంట్స్ ఆఫీసర్గా కే నరసింహమూర్తి గారు విధులను ఎంతో నిబద్ధతతో …

Read More »

సాగునీరు, డ్రైనేజీ కాలువల్లో గుర్రపు డెక్కల తొలగింపు పై వీడియో కాన్ఫరెన్స్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా పంట పొలాలు ముంపుకు గురి కాకుండా సాగునీటి కాలువలు, డ్రైనేజీ కాలువలలో గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నీటిపారుల శాఖ అధికారులతో సాగునీరు, డ్రైనేజీ కాలువల్లో గుర్రపు డెక్కల తొలగింపు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వచ్చిన మీ …

Read More »

కాలేఖాన్ పేట మున్సిపల్ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం స్థానిక కాలేఖాన్ పేట మున్సిపల్ హైస్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన, ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు సంబంధిత రికార్డులు, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు పరిశీలించారు. బయోలాజికల్ సైన్స్ లాబరేటరీ ఎక్విప్మెంట్ పరిశీలించారు. లైబ్రరీలో ఏ ఏ రకాలైన పుస్తకాలున్నాయి ఆరా తీశారు. లైబ్రరీ బుక్స్ ఇష్యూ రిజిస్టర్ తనిఖీ చేసి విద్యార్థులు ఏ ఏ పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతున్నారని అడిగి …

Read More »

పామాయిల్ సాగుతో అధిక ఆదాయం .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పామాయిల్ సాగుతో దీర్ఘకాలం అధిక ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో గురువారం ఉదయం ఆయన జిల్లాలో ఉన్న పతాంజలి, వాహ్యన్ కాఫీ, 3ఎఫ్ పామాయిల్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పామాయిల్ సాగు విధానం, బిందు సేద్యం, సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రాయితీలు, రైతుల నుండి కంపెనీలు పంట సేకరించే విధానంపై ఆయన చర్చించారు. ఈ …

Read More »

ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించడంతోపాటు సీట్ బెల్ట్ వేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రమాదాల నివారణకు వాహనదారులు ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం (హెల్మెట్) ధరించడంతోపాటు సీట్ బెల్ట్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఉద్యోగులకు శిరస్త్రాణం ధరించడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఎంతో అవసరం ఉందని, అయితే చాలామంది ద్విచక్రవాహంలో వచ్చే కలెక్టరేట్ ఉద్యోగులు శిరస్త్రాణం (హెల్మెట్ ) ధరించకుండా వస్తున్నారన్నారు. …

Read More »

జిల్లాలో ప్రారంభమైన కుష్టు ‌వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేటి నుండి జిల్లాలో ఉన్న‌ కుష్టు ‌వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించుటకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి. గీతాబాయి అధ్యక్షతన మరియు డాక్టర్ ఏ వెంకట్రావు జిల్లా లెప్రసీ నియంత్రణ అధికారి పర్యవేక్షణలో వైద్యాధికారులు, ఆరోగ్య కేంద్ర నోడల్ అధికారులు ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ పై శిక్షణ కార్యక్రమం నుపూర్తిచేసి సర్వే నిర్వహించుటకు ఆశా కార్యకర్త మరియు ఒక మగ వాలంటీర్ ను గ్రూపు సభ్యులుగా ఏర్పాటు చేసుకొని …

Read More »

చాలా పరిశ్రమలు రాబోతున్నాయి… నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నానికి త్వరలో చాలా పరిశ్రమలు రాబోతున్నాయని, లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని రహదారులు భవనాలు అతిధి గృహంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలామంది పారిశ్రామికవేత్తలు మచిలీపట్నంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారన్నారు. అందులో భాగంగానే కోట్లాది రూపాయలతో బిపిసిఎల్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కాబోతున్నదన్నారు. అలాగే విద్యుత్తు, బ్యాటరీల …

Read More »

హెల్మెట్ ధరించడం భారం కాదు “రక్షణ”

-హెల్మెట్ ధారణ-ప్రాణానికి రక్షణ -హెల్మెట్ ధరించడంపై ర్యాలీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం “హెల్మెట్ ధరించడంపై” వన్-కె అవగాహన నడక(ర్యాలీ) జిల్లా కోర్టు ప్రాంగణము నుండి ప్రారంభమై నగర ప్రధాన వీధుల గుండా రేవతి థియేటర్ సెంటర్ వరకు, తిరిగి జిల్లా కోర్టు ప్రాంగణం చేరుకునేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ ధరించడం …

Read More »

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

-హెల్ సెక్రటరీలు కచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలి -ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెల్త్ సెక్రటరీలు ప్రతిరోజు ప్రజలకు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కచ్చితంగా నిర్వహించాలని అధికారులకు అదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా శ్రీనివాస నగర్, 16, 17, …

Read More »