Breaking News

Daily Archives: July 19, 2024

భారీ వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి .. జిల్లా కలెక్టర్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గన్నవరంలోని ఎంపీడీవో కార్యాలయం నుండి రెవెన్యూ డివిజన్ల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాలు, వరదల పట్ల తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో …

Read More »

ఫ్రైడే డ్రైడే పాటిద్దాం – డెంగ్యూ,మలేరియాలను నివారిద్దాం 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చిలకలపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వి.శ్రావ్య పర్యవేక్షణలో  శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆషా మరియు ఆరోగ్య కార్యకర్తల ద్వారా దోమల నియంత్రణ కొరకు ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటిస్తూ గృహ దర్శనముల ద్వారా ఇళ్ళలోఉన్న నిల్వ నీటిలోని లార్వాలను తొలగించుట ,నీటి నిల్వలు ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు ,టైర్లు ,వృధాగా పారవేసిన ప్లాస్టిక్ బాటిల్లు , టైర్లు ,వృధాగా పారవేసిన ప్లాస్టిక్ కుండీలు ,ఇతర గృహపకరణాలను శుభ్రము …

Read More »

విస్తృత ప్ర‌జా భాగ‌స్వామ్యంతో సీజ‌న‌ల్ వ్యాధులకు అడ్డుక‌ట్ట‌

– ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో స‌మ‌ర్థ‌వంతంగా ఫ్రైడే-డ్రై డే అమ‌లు – డెంగీ, మ‌లేరియా వ్యాధి కార‌కాల‌పై అవ‌గాహ‌న‌తో పాటు అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం – రెండు మూడు నెల‌ల పాటు ప్ర‌త్యేక జ‌న జాగృతి ర్యాలీలు, కార్య‌క్ర‌మాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డెంగీ, మ‌లేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నామ‌ని.. అదే విధంగా సీజ‌న‌ల్ వ్యాధుల‌కు అడ్డుక‌ట్ట వేసి ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణంలో ప్ర‌జా భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ …

Read More »

విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతంగా నిర్వహించిన ఫ్రైడే – డ్రై డే

-నగర ప్రజలకు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలపై అవగాహన కార్యక్రమాలు -64 డివిజన్లో ఫ్రైడే – డ్రై డే అవగాహన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంగ్యూ మలేరియా డయేరియా వ్యాధులను అరికట్టేందుకు ప్రజలకు వాటి నివారణకై అవగాహన కార్యక్రమాలను, విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతంగా నిర్వహించింది. శుక్రవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించిన “ఫ్రైడే -డ్రై డే ” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి సృజన, గౌరవనీయులైన పార్లమెంట్ …

Read More »

ముంపు నివారణ, ఎర్ర కాలువ ఏటిగట్టు పటిష్టతకు శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను ప్రణాళిక బద్ధంగా చేపట్టనున్నాం.

-నిడదవోలు మండలంలో సుమారు 13 వేల ఎకరాలోని పంట పొలాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. -ఇప్పటివరకు ఎకరాకు రు. 20 వేలు రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం -నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది -నిడదవోలు మండలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన.. -పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : అల్పపీడన ప్రభావం వలన గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నిడదవోలు …

Read More »

అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసే వెంచర్లు లేదా లే అవుట్స్ ని తొలగిస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసే వెంచర్లు లేదా లే అవుట్స్ ని తొలగిస్తామని, ప్రజలు కూడా అనుమతి పొందిన వెంచర్లలలోనే స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్ లో సమస్యలు రాకుండా ఉంటాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పరిధిలోని నల్లపాడు రోడ్ లోని ఆదర్శ నగర్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ వెంచర్ హద్దు రాళ్లు, మార్కింగ్, …

Read More »

ప్రధాన రహదార్లకు ప్యాచ్ వర్క్ లు తక్షణం చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజల రాకపోకలకు ఆటంకం లేకుండా ప్రధాన రహదార్లకు ప్యాచ్ వర్క్ లు తక్షణం చేపట్టాలని, ప్రజా ప్రతినిధుల క్షేత్ర స్థాయి పర్యటనల్లో సంబందిత అధికారులు కూడా పాల్గొని, పర్యటనలో గుర్తించిన సమస్యల పరిష్కారనికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవితో కలిసి, నియోజకవర్గంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఇంజినీరింగ్ అధికారులతో …

Read More »

పూడిక తీత జరగని ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన తీయించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పూడిక తీత జరగని ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన తీయించాలని, తీసిన పూడికను ఎప్పటికప్పుడు తరలించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కెవిపి కాలనీ, పట్టాభిపురం, స్తంభాల గరువు, భాగ్య నగర్, తుఫాన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైన్లలో పూడికతీత పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోని డ్రైన్లలో పూడికతీత …

Read More »

ఆయిల్ పామ్ సాగు చాలా లాభదాయకం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయిల్ పామ్ సాగు చాలా లాభదాయకమని, రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని, అధిక ఆదాయాలు పొందేల రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గన్నవరం ఎంపీడీవో కార్యాలయ మీటింగ్ హాల్లో గ్రామస్థాయి ఉద్యాన, వ్యవసాయ సహాయ సిబ్బందికి ఆయిల్ ఫామ్ సాగు పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »