Breaking News

Daily Archives: July 23, 2024

ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానం..!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కానూరు లో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి “టాలీ (Tally)” కోర్సుపై సర్టిఫికెట్ తో కూడిన ఉచిత శిక్షణ తో పాటు ఖచ్చితమైన ఉద్యోగావకాశాలకు సంబంధించి అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలియజేసారు. అనంతరం జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు మాట్లాడుతూ ఈ శిక్షణలకు బి.కామ్, బీఎ, బీబీఏ, ఎమ్.కామ్ …

Read More »

స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రతి ఇల్లు టాక్స్ అసెస్మెంట్ చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రతి ఇల్లు టాక్స్ అసెస్మెంట్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ/ వార్డు పంచాయతీ కార్యదర్శులు, పరిపాలన కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి పన్నుల వసూళ్లు, టాక్స్ అసెస్మెంట్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా నిర్మించిన గృహాలకు పన్ను …

Read More »

భూముల అలినేషన్, ముటేషన్ చేయుటకు ప్రతిపాదనలు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పుటకు అవసరమైన భూముల అలినేషన్, ముటేషన్ చేయుటకు ప్రతిపాదనలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర రావుతో కలిసి రెవెన్యూ శాఖ, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల అలినేషన్, ముటేషన్, 22 ఏ తొలగింపులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

కులాలు వేరైనా అందరూ ఐక్యంగా ఉండాలి…

–రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ చినగొల్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : కులాలు వేరైనా అందరూ ఐక్యంగా ఉండాలని, మానవతా దృక్పథంతో సామరస్యంగా మెలగాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ప్రజలను కోరారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అధికారులతో కలిసి కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం బీచ్ వద్ద కొన్ని కులాల మధ్య తలెత్తిన భూ సమస్యలను విచారించారు. భూ సమస్య ప్రాంతాన్ని పరిశీలించి ఆయా కుల సంఘ పెద్దలు, గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం …

Read More »

మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచే సమగ్ర ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి అందజేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచే సమగ్ర ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఢిల్లీ ప్రతినిధులను కోరారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రజా ఆరోగ్య పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ( సి పి హెచ్ ఈ ఈ ఓ) ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మచిలీపట్నంలో …

Read More »

ప్రతి ఒక్కరు యోగా శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంపూర్ణ ఆరోగ్యానికి యోగ ఎంతగానో ఉపకరిస్తుందని, ఉద్యోగులు ప్రతి ఒక్కరు యోగా శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నగరంలోని జడ్పీ కన్వెన్షన్ హాలులో జిల్లా కలెక్టర్ చొరవతో తొలిసారిగా జిల్లా అధికారులు, ఉద్యోగులకు ఉచిత ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యోగా …

Read More »

భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పోర్టు కనెక్టివిటీ రైలు రోడ్డు మార్గాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పోర్టు, మేరీ టైం బోర్డు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు అభివృద్ధి పనుల్లో భాగంగా పోర్టు కనెక్టివిటీ రైల్ రోడ్డు మార్గాల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సమస్యలపై సమీక్షించారు. …

Read More »

రాజధాని అభివృద్దే లక్ష్యం… రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయం!

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని పునర్నిర్మాణం చేపట్టి అభివృద్ది చేసే బాధ్యత ఎన్డీయే సర్కారు తీసుకుంటుందని అందుకు బిజెపి ఎమ్మెల్యేలంతా శక్తి వంచన లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహకరిస్తామని పశ్చిమ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల రెండవ రోజైన మంగళవారం శాసనసభలో సుజనా చౌదరి ప్రసంగించారు. ముందుగా అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గడచిన …

Read More »

కాలుష్య రహిత నగరానికి మరో అడుగు వేసిన విజయవాడ నగర పాలక సంస్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్తంగా కాలుష్యాన్ని నియంత్రించే దిశగా మరో అడుగు ముందుకు వేశారు. విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కె.వి సత్యవతి మంగళవారం అర్థ గ్లోబల్, ముంబై మరియు ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (TERI), న్యూఢిల్లీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కె.వి సత్యవతి మాట్లాడుతూ వాయు కాలుష్య నియంత్రణకు, ఈ బృందం మంగళవారం మరియు బుధవారం విజయవాడ నగరంలో …

Read More »

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం లయోలా కాలేజీ రోడ్, ఎన్టీఆర్ కాలనీ రోడ్, భాను నగర్, కేదరాశ్వర్ పేట ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా నాలుగో డివిజన్ లయోలా కాలేజ్ రోడ్డు దగ్గర తీసి ఉన్న సెల్ఫ్ ని గమనించి, మేజర్ డ్రైన్ లలో కానీ సైడ్ డ్రైనలలో కానీ సిల్ట్ …

Read More »