Breaking News

Monthly Archives: July 2024

ఘనంగా 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమము

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 26 జూలై 1999న పాకిస్తాన్ పై భారత సైన్యం సాధించిన ఘన విజయంను పురస్కరించుకొని వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను, భారత రక్షణ దళములలో సేవలందిస్తున్న సైనికులు, సేవలు అందించిన మాజీ సైనికులును గుర్తు చేసుకొంటూ 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంను ఈ రోజు అనగా తేదీ: 26జూలై 2024న సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ కళ్యాణవీణ. కె (రిటైర్డ్), జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి, ఎన్.టి.ఆర్ &కృష్ణా జిల్లా @ విజయవాడ వారి ఆద్వర్యంలో జిల్లా …

Read More »

మిషన్ వాత్సల్య పథకం ద్వారా రూ.88.32 లక్షలు విడుదల

-కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లాకు 368 మంది పిల్లలకి ఆర్ధిక చేయూత కింద రూ.88 లక్షల 32 వేలు అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేసారు. శుక్రవారం కలెక్టరు ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం కింద లబ్దిదారుల పిల్లలకు ఆరు నెలల ప్రయోజనం విడుదల కోసం కలెక్టర్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, కేంద్ర …

Read More »

“రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.. ప్రకాష్ బాబు, “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె . ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతి వేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం …

Read More »

“మాదక ద్రవ్యాల నిషేధం”, “ఆంధ్ర ప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997” పై న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి(ఆర్.ఐ.ఇ.టి) ఇంజనీరింగ్ కళాశాలలో “మాదక ద్రవ్యాల నిషేధం” మరియు “ఆంధ్ర ప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చెడు స్నేహాల వల్ల కానీ, పరిస్థితుల …

Read More »

జిల్లాలో రోగనిరోధక టీకాల లక్ష్యసాధన నూరుశాతం జరగాలి.

-ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను మెరుగుపరచాలి. -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోగనిరోధక టీకాల లక్ష్యసాధన క్షేత్ర స్థాయిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలు జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో రోగనిరోధక శక్తిని పెంచే టీకాలు నిర్దేశించిన వయసుగల పిల్లలందరికీ క్రమం తప్పకుండా వేయాల్సి ఉందన్నారు. తల్లి …

Read More »

ప్రతీ ఒక్కరిలో జాగృతి కలుగ చెయ్యడం తనిఖీల ముఖ్య ఉద్దేశ్యం

-స్కూల్స్ లో నూరుశాతం చెర్పికలు లక్ష్యం సాధించాలి -ఆకస్మిక తనిఖీలు పర్యవేక్షణా ద్వారా జవాబుదారీతనం పెంచడం సాధ్యం -సోమవారం నుంచి స్కూల్స్ తనిఖీలు నిర్వహిస్తా .. -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యవేక్షణ విధానం , అప్రమత్తత తో వ్యవహరించడం ద్వారా పాఠశాలల్లో విద్యా బోధన విధానాన్ని , నిర్వహణా సామర్ధ్యం గణనీయంగా పెంచడానికి ఆస్కారం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో పాఠశాల విద్యా పై విద్యా శాఖల …

Read More »

సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు లాభసాటి కలుగ చేసేలా కృషి చెయ్యాలి

-మిల్లర్లను, హోల్ సేల్ వ్యాపారులను భాగస్వామ్యం చెయ్యాలి -పొలంబడి – ‘గాప్’ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్  ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులను శాస్త్రీయ వ్యవసాయ సాగు విధానం దిశలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా తీర్చిదిద్దడమే కాకుండా, వారు పండించే పంటలకు తగిన ధరలు కలుగ చేసేలా కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  2024-25 సంవత్సరంలో పొలంబడి,  GAP …

Read More »

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

-పిల్లల గ్రోత్ పరిశీలన -గర్భవతుల, బాలింతల గృహాలు సందర్శించిన కలెక్టర్ -ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అందిందో లేదో పరిశీలన గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడి కేంద్రాలు సరిగా నిర్వహించాలని, గర్భవతులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గూడూరు మండలంలో పటాన్ పేట, జమ్మిరామరాజుపాలెం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పటాన్ పేట, రామరాజుపాలెం అంగన్వాడి కేంద్రాలు సందర్శించిన కలెక్టర్ చిన్నారుల హాజరు పట్టి పరిశీలించారు, …

Read More »

ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న కమిషనర్

-లోతట్టు ప్రాంతాల వాడ వాడల పర్యటన – విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర ఐఏఎస్ తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం లోతట్టు ప్రాంతమైన 17వ డివిజన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా 17వ డివిజన్ శాంపుల్ బిల్డింగ్ దగ్గర నుండి మొదలై వాడవాడల తిరిగి ప్రజలను వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వాళ్ళ ఇంటి ముందున్న మురుగునీటి …

Read More »

ప్రజలను మలేరియా, డెంగ్యూ జ్వరాలు నుండి కాపాడేందుకే ” ఫ్రైడే డ్రైడే”

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలను దోమ కాటు వల్ల జరిగే మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన చంద్ర ఐఏఎస్ “ఫ్రైడే డ్రై డే” అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్, 18వ డివిజన్, రాణీగారి తోటలో  ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజలకు మలేరియా, డెంగ్యూ, చికెన్ …

Read More »