Breaking News

Monthly Archives: July 2024

రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రహారీ క్లబ్ లు ఏర్పాటు

-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ,కళాశాలల్లో మరియు వసతి గృహాల్లో డ్రగ్స్ వినియోగం,విక్రయంని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రహారీ క్లబ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ ఏం.ఆర్ .ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ రోజు రాష్ట్రం లోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు మరియు విద్యాశాఖ సిబ్బంది తో విద్యాసంస్థలు …

Read More »

వైసీపీ ప్రభుత్వంలో బీమా పేరుతో దారుణమైన మోసం

-ప్రీమియం చెల్లించకుండా రైతాంగానికి అన్యాయం చేశారు- -ప్రభుత్వమే బీమా కంపెనీ పెట్టిందని మబ్యపెట్టారు- -ఎన్డీయే ప్రభుత్వంలో ఉత్తమ విధానం అమలు- -శాసన మండలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు  సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం బీమా పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వ …

Read More »

డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు టిడ్కో గృహాలకు మౌళిక‌వ‌స‌తులు పూర్తి చేసేలా చ‌ర్య‌లు

-కేంద్రం అనుమ‌తించిన వేలాది ఇళ్ల‌ను గ‌త ప్ర‌భుత్వం నిలిపివేసింది -ప్ర‌తి మ‌హిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా ఇళ్ల నిర్మాణం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల‌తో పాటు మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న వ‌చ్చే డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేసేలా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు మున్సిప‌ల్,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌..టిడ్కో గృహాల‌పై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు,వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు,తెనాలి శ్రావ‌ణ్ కుమార్,కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నారాయ‌ణ స‌మాధానం ఇచ్చారు..రాష్ట్రంలో 2014-2019 మ‌ధ్యకాలంలో నిర్మించిన …

Read More »

గ‌త ప్ర‌భుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి

-త‌ణుకు,విశాఖ‌,గుంటూరు,తిరుప‌తిలో భారీగా అక్ర‌మాలు -అధికారుల‌తో పాటు నేత‌ల ప్ర‌మేయం ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు -సీఎంతో చ‌ర్చించి విచార‌ణ క‌మిటీలు వేస్తామ‌న్న‌మంత్రి నారాయ‌ణ‌ -అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మాధానం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని అసెంబ్లీ వేదిక‌గా స్ప‌ష్టం చేసారు మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌..బాండ్ల జారీ వెనుక అధికారులున్నా,రాజ‌కీయ నాయ‌కులున్న‌ప్ప‌టికీ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు..గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో టీడీఆర్ బాండ్ల జారీ చేసిన ప‌ట్ట‌ణాల వివ‌రాలు,జ‌రిగిన అక్ర‌మాలు,ప్ర‌భుత్వం …

Read More »

పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యం

-పాడి రైతులకు ఎన్డీయే ప్రభుత్వ ప్రోత్సాహం – -ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు పచ్చ జెండా – -ఎకరానికి రూ.99 వేలు లబ్ధి – -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గడిచిన …

Read More »

సుమోటో కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన త్వరితగతిన పూర్తి కావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుమోటో కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన త్వరితగతిన పూర్తి కావాలని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సుమోటో వెరిఫికేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ జారీ అంశంపై గురువారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సుమోటో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియకు ముందుగా చేపట్టే వెరిఫికేషన్ ప్రక్రియను వీఆర్వోలు పూర్తి …

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో 2024-25 విద్యా సంవత్సరపు ప్రవేశాలకు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలలలో ప్రవేశాలకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన డిగ్రీ విద్యనందించే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు డిగ్రీ విద్యనభ్యసించగోరు విద్యార్థులకు సకల సౌకర్యాలు కలుగజేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యాశాఖ సారధ్యంలో మొత్తం 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పనిచేస్తుండగా, వీటిలో 24 కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉన్నాయి, ప్రత్యేకించి విద్యార్థినుల నిమిత్తం 23 మహిళా డిగ్రీ కళాశాలలు వసతి గృహ సదుపాయంతో అందుబాటులో ఉన్నాయి. 106 …

Read More »

చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సౌకర్యాల కల్పనలో అలక్ష్యం చేయొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు సందర్భంగా… నగరంలోని మేరీస్ స్టెలా కాలేజీ, ఏ ప్లస్ కన్వన్షన్ సెంటర్ ను గురువారం ఆమె పరిశీలించారు. ముందుగా మేరీస్ …

Read More »

రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన సుజనా చౌదరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాజ్ నాథ్ సింగ్ కు సుజనా వివరించారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లను స్మరించుకుంటూ భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో కొత్తపేట లో గురువారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైగల్ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మరియు మాజీ సైనికులు కేబీఎన్ కళాశాల విద్యార్థులతో కలిసి …

Read More »