-తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి -తల్లి పాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తల్లి పాలు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తల్లి పాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగనిరోధక శక్తిని పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. …
Read More »Monthly Archives: July 2024
పెన్షన్ల పంపిణీ పెన్షనర్ల ఇంటి వద్దనే నూరు శాతం జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ పెన్షనర్ల ఇంటి వద్దనే నూరు శాతం జరగాలని, పెన్షన్ల పంపిణీలో ఏ సమస్య రాకుండా నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర కమిషనర్ గా భాధ్యతలు తీసుకున్న అనంతరం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతలతో పెన్షన్ పంపిణీ, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ (ఎఫ్ఏసి) మాట్లాడుతూ గుంటూరు …
Read More »ర్యాంక్ సాధించడానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ సర్వేక్షణ్ 2024లో గుంటూరు నగరపాలక సంస్థకు మెరుగైన ర్యాంక్ సాధించడానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఎంహెచ్ఓ (ఎఫ్ఏసి) మధుసూదన్ తెలిపారు. నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఆదేశాల మేరకు స్వచ్చ సర్వేక్షణ్ 2024లో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజారోగ్య అధికారులు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుధ్యాన్ని సాధించడానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని, …
Read More »పెద్దలకు టీబీ బిసిజి టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలి
-రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దలకు టీబీ బిసిజి టీకాలు( ADULT TB BCG VACCINES ) వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ (Commissioner of Health and Familly Welfare C.Hari Kiran)ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను(ABHA IDs) కూడా ఎఎన్ ఎంలు క్రియేట్ చెయ్యాలన్నారు. …
Read More »పిసిపిఎన్డిటి చట్టంపై జిల్లాస్థాయి సలహా సంఘ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఛాంబర్ నందు బుధవారం డాక్టర్ జి.గీతాబాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని అధ్యక్షతన పిసిపిఎన్డిటి చట్టంపై జిల్లాస్థాయి సలహా సంఘ సమావేశమును నిర్వహించుట జరిగినది. ఈ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుట చట్టరీత్యా నేరమని మరియు అడిగినవారు, ప్రోత్సహించిన వారు శిక్షార్హులని తెలియజేసినారు. ఈ సందర్భంగా జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలు అన్నియు తప్పనిసరిగా నమోదు చేసుకొని ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి రెన్యువల్ …
Read More »జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం సమర్థవంత అమలుకు కృషి
– పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. బుధవారం కలెక్టర్ సృజన మైలవరం మండలంలోని చిలుకూరివారిగూడెం శ్రీ అప్పిడి సుబ్బారెడ్డి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన ప్రణాళిక నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. …
Read More »యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోండి…
-జీవితంలో ఎదగాలంటే కంఫర్ట్ జోన్ వదలాలి.. -చిరుద్యోగం నుండి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారే ఆదర్శం.. -జాబ్ మేళాలో 52 మందికి ఉద్యోగ అవకాశాలు.. -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని చిన్నచిన్న ఇబ్బందులను అదిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థానాన్ని సాధించవచ్చునని చిరుద్యోగం నుండి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన నిరుద్యోగ యువతకు సూచించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో …
Read More »ఉపాధి హామి పనులతో భూగర్భ జలాల పెంపు..
-ప్రతి ఒక్కరికి ఉపాది హామి ద్వారా పని కల్పిస్తున్నాం.. -జిల్లాలో ఉద్యాన తోటలకు 288 పంట కుంటల నిర్మాణం.. -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఉపాధి హామి పథకం కింద పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నామని జిల్లాలో ఉద్యాన రైతుల సౌకర్యార్ధం ఉద్యాన తోటలలో 288 పంట కుంటలు నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా జిల్లా …
Read More »ఉపాధి హామి పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఊతం
-జిల్లాలో 1760 ఎకరాలలో పండ్లు, పూల తోటల పెంపకం… -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి ఊతంతో చిన్న సన్నకార రైతులకు నూరు శాతం సబ్బిడి క్రింద ఉద్యాన పంటలను చేపట్టి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నామని జిల్లాలో 1760 ఎకరాలలో పండ్లు, పూలతోటల పెంపకాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన తెలిపారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మైలవరం మండలం …
Read More »ఈవీఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాము జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ బుధవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరచిన గోదాము వద్ద ఏర్పాటుచేసిన సెక్యూరిటీ, గోదాముకు వేయబడిన తాళాలు, వాటి సీళ్లు కలెక్టర్ పరిశీలించారు. గోదాముల వద్ద సీసీ కెమెరాలు పనిచేస్తున్నది లేనిది ఆరా తీశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారి తనిఖీల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టరేట్ సమన్వయ విభాగం డిటి శ్యామ్ కలెక్టర్ వెంట ఉన్నారు.
Read More »