Daily Archives: August 7, 2024

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ dr సిస్టర్ జె సింత క్వాడ్రాస్ చేనేత సుహృద్భావ ర్యాలీ నీ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చేనేతలు భారత దేశ గర్వ కారణమైన కళా సంపద అని చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ముఖ్య అతిథి గా లయోలా కళాశాల ఏవియేషన్ విభాగ అధ్యపకురాలు T.నిష విచ్చేశారు. ఆమె చేనేత రంగం ప్రాధాన్యతను మరియు ప్రపంచీకరణ వల్ల మచనిసేషన్ వల్ల ఆ రంగం ఎదుర్కొంటున్న …

Read More »

బిడ్డకు తల్లిపాలు మించిన ఔషదం లేదు..

-ప్రైవేట్‌ ప్లేస్కూల్స్‌కి ధీటుగా అంగన్‌వాడీలలో మౌళిక వసతులు అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి -శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పుట్టిన బిడ్డకు తల్లిపాలకు మించిన ఔషదం మరోకటి లేదని రోగనిరోధక శక్తికి తల్లిపాలు ఎంతో దోహదపడుతాయని ప్రతి ఒక్కరు పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దెరామ్మోహన్‌ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ …

Read More »

సిఎం దృష్టికి రియల్ ఎస్టేట్ రంగ సమస్యలు

-సిసోడియాను కలిసిన నారెడ్కో ప్రతినిధి బృందం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ విభాగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సిసోడియాను కలిసి రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించింది. నారెడ్కో బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధరరావు, సెక్రటరీ జనరల్ సీతారామయ్య, …

Read More »

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపొందించండి..

-స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించాలి.. -ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకోండి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పూర్తి మౌళిక వసతులను కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు భవిష్యత్‌ అవసరాలు ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు.  గ్రామాల సమగ్రాభివృద్దికి చేపట్టవలసిన ప్రణాళికలపై బుధవారం జిల్లా కలెక్టర్‌ …

Read More »

ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు హాజరు కానున్న దృష్ట్యా చేయవలసిన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం. ధ్యానచంద్ర, డ్వామా పిడి, ఇన్చార్జి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జె సునీత పరిశీలించారు.

Read More »

జాతీయ చేనేత దినోత్స‌వంలో ముఖ్య‌మంత్రి  నారాచంద్ర‌బాబు నాయుడు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బుధ‌వారం జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని మేరీస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో జ‌రిగే ప్రత్యేక వేడుక‌ల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య‌మంత్రి  నారాచంద్ర‌బాబు నాయుడు కి స్వాగ‌తం ప‌లుకుతున్న ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌.

Read More »

నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం

-చేనేత వ‌స్త్రాల‌పై జీఎస్టీ రద్దుకు ప్రయత్నాలు -నెల‌లో ఒక రోజు చేనేత వ‌స్త్రాలు ధ‌రించి నేతన్నలను ప్రోత్సహిద్దాం -గత ప్రభుత్వం చేనేతలకు ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ రద్దు చేసింది -ఐదేళ్ల పాలనలో ఏ శాఖలో చూసినా విధ్వంసమే కనిపిస్తోంది -ఫోటోలకు వందల కోట్లు తగలేసిన గత ప్రభుత్వం..చేనేతల సంక్షేమంపై దృష్టి పెట్టలేదు. -చేనేత కార్మికుల గృహాల‌కు సౌర‌విద్యుత్ స‌దుపాయం క‌ల్పిస్తాం -ఆగస్టు 15 నుండి మళ్లీ అన్న క్యాంటీన్లు -రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జలకళ సంతోషకరం -సీఎం నారా చంద్రబాబు నాయుడు -విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో …

Read More »

గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై  ముందస్తు కార్యాచరణ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్ , రైల్వే , బస్సు ప్రయాణికులు, పుష్కర్ ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో …

Read More »

మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స గురించి సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు  మాట్లాడుతూ మానసిక రుగ్మతల తో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకలు గురించి, ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు …

Read More »

బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణ నిర్మూలన లక్ష్యంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేయాలి.

-చైల్డ్ లైన్ 1098 లేదా 9492555064, 9492555065, 9492555066, 9492555067 ఫిర్యాదు చేయండి -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రదేశాల్లో బాల కార్మికులు గా పని చేస్తున్న వారిని గుర్తించే విధంగా ముమ్మర తనిఖీలను చేపట్టి ఆయా యాజమాన్యాలపై, వ్యక్తులు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్ …

Read More »