రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స గురించి సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ మానసిక రుగ్మతల తో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకలు గురించి, ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహకారం అందిస్తామన్నారు.. ఈ కార్యక్రమం లో ఉమ్మడి తూర్పుగోదావరి కి చెందిన వైద్య అధికార్లు, డి.ఎమ్ అండ్ హెచ్.ఓ. అధికార్లు, వికలాంగుల మరియు సంక్షేమ అధికార్లు, కలెక్టరేట్ సిబ్బంది, పోలీసు అధికార్లు తదితరులు పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News