రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం షార్ శ్రీహరికోట నందు నేషనల్ స్పేస్ డే 2024 కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 5.20 గం. లకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు పయనమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు సాదర వీడ్కోలు లభించింది. ఉప ముఖ్యమంత్రికి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి …
Read More »Daily Archives: August 13, 2024
సెప్టెంబర్ మొదటి వారం నుండి రెవిన్యూ సదస్సులు
-ఉద్యోగుల బదిలీల కారణంగా వాయిదా -నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే భూముల రిజిస్ర్టేషన్లు నిలిపివేత -రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో నిర్ణయించినట్లుగా రెవిన్యూ సదస్సులను ఈ నెల 16 నుండి కాకుండా వాయిదా వేస్తూ సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నిజానికి రెవిన్యూ …
Read More »నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు
-రేణిగుంట బీసీ వసతి గృహం ఘటనపై -రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశం -ఆసుపత్రి నుంచి విద్యార్థులు డిశ్చార్జి…తరగతులకు హాజరు -భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే సహించేది లేదు : మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, రుయా ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడడంతో, …
Read More »యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పార్టిషన్ హారర్స్ రేమెంబ్రన్స్ డే ఫోటో ఎగ్జిబిషన్ అలిపిరి వద్ద ప్రారంభం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి మంగళవారంయూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పార్టిషన్ హారర్స్ రేమెంబ్రన్స్ డే ఫోటో ఎగ్జిబిషన్ ను యూనియన్ బ్యాంక్ తిరుపతి రీజనల్ హెడ్ జి రాంప్రసాద్ అలిపిరి వద్దనున్న యూనియన్ బ్యాంక్ ఎటిఎం పక్కన ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ మాట్లాడుతూ నేడు విభజన భయాందోళన సంస్మరణ దినం (పార్టిషన్ హారర్స్ రేమెంబ్రన్స్ డే) పురస్కరించుకొని ఎగ్జిబిషన్ ప్రారంభించామని, మూడు రోజులు పాటు ఆగస్టు 13వ తేది నుండి 15 …
Read More »ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం
-ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది -గ్లోబల్ స్పేస్ ఎకానమీలోనూ భారత్ ముద్ర వేసింది -ఎన్డీయే ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తుంది -అపజయంలోనూ శాస్త్రవేత్తలకు ప్రధాని శ్రీ మోదీ గారు ఇచ్చిన ధైర్యం గొప్పది -ఇస్రోకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా సహకరిస్తుంది -ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, యువతలో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేలా ఇస్రోతో ఎంఓయూ చేసుకుంటాం -శ్రీహరికోట షార్ లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశ భక్తి భావన పెంపొందుతుంది
-మున్సిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య -మన దేశంలో యువత దేశ భక్తి భావన పెంపొందించుకోవాలి: ఎస్పి సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం వరకు టూరిజం మరియు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తిరుపతి నగరపాలక కమీషనర్ నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎస్పీ సుబ్బ రాయుడు, సంబంధిత అధికారులతో కలసి పాల్గొన్నారు. …
Read More »ఫోటో ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ను నిర్దేశిత గడువులోపు నాణ్యతగా చేపట్టాలి
-సీఈఓ వివేక్ యాదవ్ -మార్గదర్శకాల మేరకు ఎస్ఎస్ఆర్ 2025 చేపడతాం: జేసీ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో ఫోటో ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కొరకు బిఎల్ఓ లు వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి పరిశీలించాలని రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. మంగళవారం ఉదయం వెలగపుడి సచివాలయం నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో ఎస్ఎస్ఆర్ …
Read More »ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం
రేణిగుంట, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రికి జెసి శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓ లు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన …
Read More »ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, రోల్ మోడల్ గా ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజవర్గంలో అందరికీ ఆరోగ్యమనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు పశ్చిమ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అరవై రోజుల తన పాలనలో నియోజకవర్గంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వికలాంగులకు, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సేవలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటున్నారు. ఆగస్టు 10వ తేదీన భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా అంచనాలకు మించి …
Read More »15న కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెలవు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉత్తర్వుల మేరకు 15-08-2024 తేదిన (గురువారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను …
Read More »