రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం షార్ శ్రీహరికోట నందు నేషనల్ స్పేస్ డే 2024 కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 5.20 గం. లకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు పయనమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు సాదర వీడ్కోలు లభించింది. ఉప ముఖ్యమంత్రికి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి, అదనపు ఎస్పీ కుల శేఖర్, రేణిగుంట డిఎస్పీ వెంకటాద్రి, ఎస్బి డిఎస్పీ గిరిధర్ తదితరులు సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
Prajavartha Online Telugu News