Daily Archives: August 18, 2024

రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం చంద్రబాబు రేపు (సోమ‌వారం) తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1,213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రేపటి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. కాగా, చంద్రబాబు రేపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు. ఇక్కడి సోమశిల …

Read More »

తుంగభద్ర డ్యాంకు స్టాప్ లాగ్ ఏర్పాటులో విజయవంతం చేసిన అందరికీ అభినందనలు

-సంపద సృష్టించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ఇకనైనా దృష్టి పెట్టండి -ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19 గేటు ద్వారా రిజర్వాయర్ నుండి తరలిపోతున్న నీటిని నిలువరించడానికి స్టాప్ లాగ్ గేట్లను సమర్థవంతంగా అమర్చిన సాంకేతిక నిపుణులకు, అందుకు సహకరించిన తుంగభద్ర జలమండలికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామి రెడ్డి అభినందనలు తెలియజేశారు. రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంత రైతుల నీటి అవసరాలను …

Read More »

అన్న క్యాంటీన్లకు మాజీ ఎంపీ గోకరాజు కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ చెక్‌ను ఆదివారం మంత్రి నారా లోకేశ్‌కు అందజేశారు. గంగరాజు చేయూతకు, ఉదార సహకారానికి మంత్రి లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెరుగైన ఆంధ్రప్రదేశ్‌కు బాటలు వేసేందుకు వివిధ భాగస్వాములు కలిసి వస్తున్నందుకు సంతోషిస్తున్నానంటూ, గంగరాజు విరాళమిచ్చిన ఫొటోను ‘ఎక్స్‌’లో మంత్రి లోకేశ్‌ పోస్ట్‌ చేశారు.

Read More »

ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ ఆల్‌ ఇండియా జైహింద్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. అదివారం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నాయకులతో కలసి ధర్నాచౌక్‌ వద్ద దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అందుకు రాజకీయ పక్షాలు, కార్మిక పక్షాల నాయకులు ప్రజలను సంఘటితం చేసి కేంద్రంపై వత్తిడి …

Read More »

నగరాభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయండి

-రెండు వారాల్లో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయాలి -కార్పొరేషన్ కమిషనర్ తో పెమ్మసాని గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ‘నగరాభివృద్ధిపై పూర్తి దృష్టి సారించాలి. రోడ్ల ప్యాచ్ వర్క్ లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. కార్పొరేషన్ పై ఉన్న వ్యయభారం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.’ అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్  చెప్పారు. గుంటూరులోని స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసాని ని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం కలిశారు. …

Read More »

రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యుద్దప్రాతిపదికన చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యుద్దప్రాతిపదికన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ గోరంట్ల కొండమీద నిర్మాణపనులు నిలిచిన రిజర్వాయర్ ని పరిశీలించి సంబందిత అధికారులకు, కాంట్రాక్టర్ కు పనుల పురోగతిపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్రాజెక్ట్ వలన ఏ ప్రాంతాలకు, ఎంత మంది జనాభాకు …

Read More »

తుంగభద్ర డ్యాం లో ‘క్రస్ట్ గేట్’ స్థానంలో ‘స్టాప్‌ లాగ్’ ఏర్పాటు చెయ్యటం అద్భుతం

-సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హోస్పేట్ లోని తుగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో… స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియ నిన్న విజయవంతంగా పూర్తైన నేపధ్యంలో దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడలోని రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య కార్యాలయం నుండి అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఈ రోజు సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

ఆగస్టు 19న తిరుమ ల శ్రీవారి ఆల‌యంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 19వ తేదీన శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ వల్ల విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ’రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

Read More »

సాయి చరిత శతకం ఆవిష్కరణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సాహిత్య పరిషత్- మచిలీపట్టణం ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నం పోర్ట్ రోడ్డులోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ప్రముఖ రచయిత్రి పల్లావఝల వెంకట శైలజ రచించిన సాయి చరిత శతకం ఆవిష్కరణ సభ జరిగింది. భారతీయ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిధిగా, గ్రంధ ఆవిష్కర్తగా రాష్ట్ర మైన్స్, జియాలజి అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి శతకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతి స్వీకర్తగా, గౌరవ అతిధిగా అవనిగడ్డ …

Read More »

భారతీతీర్థ మహాస్వామివారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ఉదయం శృంగేరీ చేరుకొన్నారు. మొట్టమొదట శృంగేరీలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నరసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువులను దర్శించుకున్నారు. మొదట జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. తదనంతరం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటగా దక్షిణామ్నాయ …

Read More »