Breaking News

Daily Archives: August 23, 2024

ప్రజల సమస్యలకు కొరకు గ్రామసభలు : జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్

-ఇది ప్రజల ప్రభుత్వం : చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని పాకాల, కె.వడ్డేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారం కొరకు గ్రామసభల ద్వారానే పరిష్కారం చూపవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పాకాల మండలంలోని కె.వడ్డేపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామసభకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి …

Read More »

సివిల్ జడ్జి కోర్ట్ భవనాలను వర్చువల్ విధానంలో ప్రారంభం

తిరుపతి జిల్లా, గూడూరు (జ్యూడిషియల్ ఎస్పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : గూడూరు పట్టణంలో గతంలో నిర్మితమైన రెండు భవన సముదాయాల కోర్ట్ భవనంపై మొదటి అంతస్తు నందు నూతనంగా నిర్మించిన 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ మరియు సివిల్ జడ్జి కోర్ట్ (సీనియర్ డివిజన్) భవనాలను వర్చువల్ విధానంలో ఆం.ప్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అమరావతి నుండి ప్రారంభించగా గూడూరు కోర్ట్ సముదాయం సభా ప్రాంగణం నుండి ప్రిన్సిపల్ జిల్లా మరియు …

Read More »

గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ -ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలo నారాయణవనం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి గ్రామపంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి, స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎంఎల్ఏ కోనేటి ఆదిమూలం తో కలిసి జిల్లా కలెక్టర్ డా. …

Read More »

ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ వి ఎస్ ఎస్ సి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, సూళ్లూరుపేట ,నందు బ్లూ స్టార్ క్లైమేటిక్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కష్టమైసేడ్ స్కిల్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా శ్రీ సిటీ లోని ప్రముఖ కంపెనీ అయినా బ్లూ స్టార్ క్లైమేటెక్ లిమిటెడ్(Blue Star Climatech Ltd) లో ఉద్యోగాల కొరకు 28-08-2024 అనగా బుధవారం నాడు ఉదయం 9 …

Read More »

యువతరం శాస్త్ర సాంకేతికతను, విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

-గూడూరు శాసన సభ్యులు డా. పాశిం సునీల్ కుమార్ ఆకాంక్ష -జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అంతరిక్ష విశేషాల ఎగ్జిబిషన్ ప్రారంభం -గూడులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో మూడు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక ఎగ్జిబిషన్ గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : యువతరం శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి ఎదగాలని గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశిం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ …

Read More »

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులు – చిరస్మరణీయుులు

-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు బ్రిటిష్ పాలకుల నిరంకుస ధోరణికి ఎదురొడ్డి మద్రాసులో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా తన వాక్కు వినిపించి వెరవక ఛాతీ చూపిన థీరోదాత్తుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని, టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అని ఆదర్శప్రాయుడు అని, ఆయనను స్మరించుకోవడం మన బాధ్యత అని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అన్నారు. …

Read More »

దోమల నివారణకు ఫ్రైడే – డ్రై డే

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో వర్షపు నీటి నిలువల వల్ల పెరుగుతున్న దోమల లార్వాలను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమమే ఫ్రైడే -డ్రై డే అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్లోనూ ప్రజలకు దోమల వల్ల కలుగు మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా శుక్రవారం ఉదయం ఫ్రైడే- డ్రైడే కార్యక్రమం …

Read More »

ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని 152వ జయంతిని పురస్కరించుకుని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ స్పూర్తితో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకులు టంగుటూరి ప్రకాశం …

Read More »

ఎపి ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా కంచర్ల అచ్యుతరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని కంచర్ల అచ్యుతరావు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్‌లో ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌కు నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా కంచర్ల అచ్యుతరావు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ హెచ్‌-228 చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చెందాలని అప్పుడే చలనచిత్ర కార్మికులుకు మేలు …

Read More »