-ఇది ప్రజల ప్రభుత్వం : చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని
పాకాల, కె.వడ్డేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యల పరిష్కారం కొరకు గ్రామసభల ద్వారానే పరిష్కారం చూపవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పాకాల మండలంలోని కె.వడ్డేపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామసభకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి కావలసిన కనీస వసతులైన మంచినీటి సదుపాయం, గ్యాస్ కనెక్షన్, కరెంటు, మరుగుదొడ్ల నిర్మాణం, డ్రైనేజీ, వీధి దీపాలు, సిమెంటు రోడ్లు, గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు వంటి అంశాలను గ్రామ సభల ద్వారా తీర్మానించుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యలకు పరిష్కారం గ్రామ సభల ద్వారా చూపే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ గ్రామసభల ద్వారా ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామసభలు నేడు నిర్వహించడం జరిగిందని తెలిపారు. చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు జిల్లాలో పూర్తిస్థాయిలో ఉండేలా చూడాలని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీలోని ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా మరిన్ని పని దినాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా పాకాల మండలంలోని 50 పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.
చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత గ్రామ సభలకు అతీతంగా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి నెల 23 వ తేదీన గ్రామ సభలు జరగాలని , ఆ గ్రామ సభలకు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు పాల్గొని గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ప్రజలను ఉద్దేశించి ప్రజల తీర్మాను సారంగా గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజలకు కావలసిన కనీస అవసరాలను తీర్చేలా గ్రామ సభలో నిర్వహించాలని ఇది ప్రజల ప్రభుత్వం అని తెలిపారు. ఈ పంచాయతీలోని బడుగు,బలహీన వర్గాలను పని దినాలను కల్పించడం వలన ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా చూడవచ్చు అని తెలిపారు. పాకాల మండలలో అత్యవసర వైద్య సేవల నిమిత్తం 50 పడకల ఆసుపత్రిని నిర్మాణం కోసం కలెక్టర్ గారిని కోరారు. పంచాయతీలోని ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారిని గీతా రాణి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలదేవి, డ్వామా పిడి శంకర్ ప్రసాద్, జడ్పిటిసి పద్మజ, సర్పంచ్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News