అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యమం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఔత్సాహికులకు నైపుణ్య శిక్షణా కార్యక్రమంలో భాగంగా సూక్ష్మ పరిశ్రమల తయారీ, సేవల కార్యకలాపాలపై నైపుణ్య ఆధారిత శిక్షణ ఇవ్వడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. యం ఎస్ యం ఈ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు అధికారులతో ర్యాంప్ ప్రోగ్రామ్ పురోగతిని మంత్రి సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈనెల 27 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన సూచనల ప్రకారం అనుకున్న ఫలితాలను సాధించడంలో యం ఎస్ యం ఈ కార్పొరేషన్ అనుసరిస్తున్న వ్యూహాన్ని మంత్రి సమీక్షించారు. ర్యాంప్ ప్రోగ్రామ్ అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించి అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా తగిన కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.
Tags amaravathi
Check Also
నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత
-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …