Daily Archives: August 26, 2024

న‌గ‌రంలో శ్రీకృష్ణ ఆల‌యాన్ని స‌మిష్టిగా నిర్మిస్తాం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఇస్కాన్ విజ‌య‌వాడ టెంపుల్ లో కృష్ణాష్ట‌మి వేడుక‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర‌వాసుల క‌ల శ్రీకృష్ణ ఆల‌య నిర్మాణం. ఆ ఆల‌యాన్ని ఇస్కాన్ విజ‌య‌వాడ వారితో క‌లిసి స‌మిష్టిగా న‌గ‌రంలో నిర్మించేందుకు స‌హ‌కారం అందిస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా కృష్ణ‌లంక‌లోని ఇస్కాన్ విజ‌య‌వాడ టెంపుల్ లో జ‌రిగిన కృష్ణాష్ట‌మి వేడుకల‌కి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఆల‌య నిర్వ‌హ‌కులు ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం జ‌గ‌న్నాధుడికి ఎంపి కేశినేని శివ‌నాథ్ తో ప్ర‌త్యేక …

Read More »

త్వ‌ర‌లోనే నందిగామ‌, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక : ఎంపి కేశినేని శివ‌నాథ్

-నందిగామ ఎమ్మెల్యే కార్యాల‌యంలో ఎంపి వెల్ల‌డి నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ‌, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక‌ల అధికారుల‌ను క‌లిసి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక ప్ర‌క్రియ త్వ‌ర‌గా పూర్తిచేయాల్సిందిగా కోర‌తామ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. నందిగామ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాల‌యానికి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్, జ‌గ్గ‌య్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాత‌య్య తో క‌లిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, …

Read More »

పత్రికా రంగానికి పూర్వవైభవం రావాలి!

-ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి -సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు -మిజోరం గవర్నర్ కంభంపాటిని కలిసి సత్కారం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఓవైపు సోషల్ మీడియా దూసుకెళ్తుండగా, మరోవైపు సమస్యలతో పత్రికా రంగం కునారిల్లుతోందని, ప్రభుత్వాలే సహకరించి ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్ట్, ఎపియుడబ్ల్యుజె ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి (1990-2001) నిమ్మరాజు చలపతిరావు కోరారు. రాజ్యాంగంలో నాలుగో స్తంభమైన పత్రికా రంగ పూర్వవైభవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చేలా సహకరించాలని మిజోరం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబుకు విజ్ఞప్తి చేశారు. …

Read More »

ఆగస్టు 27న లక్నోలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలి ఎన్నిక

-AP నుండి పాల్గొననున్న బక్కా పరంజ్యోతి, డా జె పూర్ణచంద్రరావు తదితరులు విజయవాడ / లక్నో, నేటి పత్రిక ప్రజావార్త : వరుసగా ఐదోసారి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా బెహెన్జీ మాయావతి తిరిగి ఎన్నికకాబోతున్నారు. ఆగస్టు 27న లక్నోలో జరగబోయే జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, ఈ ఎన్నికతోపాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల పట్ల పార్టీ రచించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన వైఖరి కూడా చర్చించనున్నారని, పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా జె పూర్ణచంద్ర రావు వివరించారు. “బహుజన్ సమాజ్ పార్టీలో ప్రతి …

Read More »

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత నివ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానిపురం 43 వ డివిజన్ రోజ్ గార్డెన్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింక్ ను సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రోజ్ గార్డెన్ పార్కులో తన చేతుల మీదుగా స్కేటింగ్ రింక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 73 లక్షల …

Read More »

యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక పటమటలోని శ్రీ కృష్ణ యాదవ్ కల్యాణమండపంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే ఈరోజు సాయంత్రం పుట్టుకొట్టే ఉత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంగిరేకుల రవికుమార్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, నగర ప్రముఖులు, …

Read More »

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 9వ వార్షికోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ చిన్ని కృష్ణుని భక్త బృందం, పడాల నాగు & ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక విశాలాంధ్ర సెంటర్ నందు 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు పడాల నాగు మీడియాతో మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి దిన దిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు 9 సంవ్సతరం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం వెయ్యి మందికి …

Read More »

శ్రీ కృష్ణ జన్మాష్టమి 22వ వార్షికోత్సవ మహోత్సవములు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక రామవరప్పాడు లో యామనేని రామస్వామి వీధిలో 22 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు కొంగన రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 21 సంవత్సరాలు నుంచి చేస్తున్నామని, రామవరప్పాడు, యామనేని రామస్వామి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, సంఘ నాయకులు ఎంతో కృషి చేశారని వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. …

Read More »

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 37వ వార్షికోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక రామవరప్పాడులో 37వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుండి దిన దిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు 37 సంవ్సతరం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం ఆరున్నర వేల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే ఈరోజు …

Read More »

తరచూ ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి అనిత

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతపై పరిశ్రమల యాజమానులు, అధికారులతో అనకాపల్లిలో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరుచుగా ప్రమాదాలు జరుగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశ్రమల్లో భద్రతపై కమిటీ వేసి ఉన్నత స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తామని తెలిపారు. జగన్ పాలనలో పరిశ్రమల భద్రత గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఇంతవరకు జరిగింది …

Read More »