Breaking News

యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక పటమటలోని శ్రీ కృష్ణ యాదవ్ కల్యాణమండపంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే ఈరోజు సాయంత్రం పుట్టుకొట్టే ఉత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంగిరేకుల రవికుమార్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, నగర ప్రముఖులు, యాదవ సంఘం నాయకులు, స్థానికులు, స్థానిక పెద్దలు, అభిమానులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *