Breaking News

Monthly Archives: August 2024

ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి పెంపుకు చర్యలు చేపట్టాలని సెర్ప్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి -స్వయం సహాయక సంఘాలను స్వయం ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలని అధికారులకు సూచించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 27 ఆగస్టు 2024: ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాది అవకాశాల పేపుకోసం మెరుగైన ఫలితాలు సాధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాందుల సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …

Read More »

స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికలుండాలి…

-100 రోజులు, వార్షిక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌పై క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృత ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు, గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా ప్ర‌తి శాఖా 100 రోజులు, వార్షిక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ఖ‌రారు చేసి, ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు నిబ‌ద్ధ‌త‌తో కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావుతో క‌లిసి జిల్లాస్థాయిలో శాఖ‌ల 100 …

Read More »

చవితి పందిళ్ళ ఏర్పాటుకు అన్‌లైన్‌ అనుమతి తప్పనిసరి…

-రసాయన రహిత వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయండి.. -చవితి పందిళ్ళ నిర్వహణలో భద్రత చర్యలను పాటించండి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పండుగా సందర్భంగా జిల్లాలో వినాయక పందిళ్ళు ఏర్పాటు చేసే నిర్వహకులు తప్పనిసరిగా అన్‌లైన్‌ ద్వారా అనుమతి పొందాలని, సాద్యమైనంత మేరకు రసాయన రహిత విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో చవితి పందిళ్ళను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన సంబంధిత అధికారులకు సూచించారు. వినాయక …

Read More »

జిల్లాలో మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు..

-గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై గట్టి నిఘా పెట్టండి.. -మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై ఉక్కు పాదం మోపండి… -అధికారుల సమష్టి కృషితో మాదక ద్రవ్యాలను నియంత్రించండి.. -జిల్లా కలెక్టర్‌ జి. సృజన విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగం పై గట్టి నిఘా పెట్టాలని, గంజాయి మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ …

Read More »

ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -మంత్రి నిమ్మల రామానాయుడు దృషికి తాగునీటి-సాగునీటి స‌మ‌స్య‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపి కేశినేని శివ‌నాథ్ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడును కోరారు. ఈ మేర‌కు జ‌గ్గ‌య్య‌పేట‌కు విచ్చేసి ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు పరిశీలించాల్సిందిగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడును ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వ‌నించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో …

Read More »

ఉమ్మ‌డి కృష్ణ‌జిల్లాలో భూక‌జ్జా ఫిర్యాదులు ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప‌రిష్క‌రిస్తాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -టిడిపి కేంద్ర‌కార్యాల‌యంలో గ్రీవెన్స్ కార్య‌క్ర‌మం -గ్రీవెన్స్ లో పాల్గొన్న కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ , ఎంపి కేశినేని శివ‌నాథ్ -ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌ర‌ణ‌ -రాజ‌కీయాల‌కు అతీతంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి -మీడియాకి ఎంపి కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం, దురాశ బాధ్య‌త‌రాహిత్యం కార‌ణంగా రాష్ట్రంలో ప్ర‌తి జిల్లాలో వైసిపి నాయ‌కులు భూక‌జ్జాలు, భూఆక్ర‌మ‌ణ‌లు, భూ దోపిడికి పాల్ప‌డ్డారు. అలాగే రెవెన్యూ రికార్డ్స్ లో వివ‌రాలు స‌రిగ్గా న‌మోదు కాకుండా అడ్డుకున్నారు. …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యంతో మరణించిన టిడిపి కార్యకర్త ఎర్ర రాజు కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 51 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు యండి జాహీద్ తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరుపేద అయినటువంటి ఎర్ర రాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని జాహీద్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక …

Read More »

బిజెపిలో చేరిన వైసిపి కార్పొరేటర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి కి మరోసారి షాక్ తగిలింది. 39 వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో గాయత్రి నగర్ లోని పురందేశ్వరి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే పశ్చిమ లోని వైసిపి కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, హర్షద్, మైలవరపు మాధురి లావణ్య, టిడిపి ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టిడిపి …

Read More »

ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటీష్ కాలపు రాచరికపు పోకడలకు స్వస్తి పలకనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ , స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు సిద్దం చేసారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఉండేలా చర్యలు ప్రారంభించారు. సబ్ రిజిస్ట్రార్లు …

Read More »

నేత్రదానంతో మరికొందరికి చూపు

-వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి మరణానంతరం తన నేత్రదానంతో మరికొందరికి చూపు రప్పించవచ్చని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్, జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్న జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రచార పోస్టర్, కరపత్రాన్ని ఆయన సోమవారం మంగళగిరి ఎపిఐఐసి భవన సముదాయంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దాదాపు 1,312 …

Read More »