-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
-టిడిపి కేంద్రకార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం
-గ్రీవెన్స్ లో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ , ఎంపి కేశినేని శివనాథ్
-ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణ
-రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి
-మీడియాకి ఎంపి కేశినేని శివనాథ్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, దురాశ బాధ్యతరాహిత్యం కారణంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైసిపి నాయకులు భూకజ్జాలు, భూఆక్రమణలు, భూ దోపిడికి పాల్పడ్డారు. అలాగే రెవెన్యూ రికార్డ్స్ లో వివరాలు సరిగ్గా నమోదు కాకుండా అడ్డుకున్నారు. వీటి పైనే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయటానికి ప్రజలు తరలివచ్చారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన గ్రీవెన్స్ కార్యాక్రమంలో కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. బాధితుల తెలిపిన వివరాలను నమోదు చేసుకున్నారు. సంబంధిత మంత్రి, అధికారులకు చెప్పి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి ప్రధాన కార్యాలయానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ రావటం జరిగింది. ముందుగా కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇద్దరు నివాళులర్పించి గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్, ఇతర మాజీ వైసిపి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దేవదాయ భూములే కాదు, అగ్రిగోల్డ్ భూములతో పాటు చాలా భూములు భూకబ్జా చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రతి జిల్లాలో ఒక మంత్రి ఆధ్వర్యంలో వైసిపి బడా నాయకుల సహకారంతో భూదోపిడి జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా భూ దోపిడి జరిగిందని తెలిపారు. రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న ప్రజల ఫిర్యాదులు పరిష్కరించేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇక ఉమ్మడి కృష్ణజిల్లా నుంచి వచ్చే ఫిర్యాదులు పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి సమిష్టిగా కృషి చేస్తామన్నారు. కృష్ణ జిల్లా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదుల ఒత్తిడి కేంద్ర కార్యాలయం పై పడకుండా పరిష్కరిస్తామని తెలియజేశారు..
త్వరలోనే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ని ప్రక్షాళన
గత ప్రభుత్వం భూముల్నే కాదు…ఎపి ఒలింపిక్ అసోసియేషన్ కూడా కబ్జా చేసిందని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎపి ఒలింపిక్ అసోయేషన్ లో 34 ఫెడరేషన్స్ వుంటే అన్ని దొంగ రిజిస్ట్రేషన్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్ అక్రమాల్లో వైసిపి నేత ప్రమేయం వుందన్నారు. దాదాపు 340కేసులతో ఒలింపిక్ అసోసియేషన్ చీడ పట్టుకుపోయి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం లో చోటుచేసుకున్న మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.దొంగ రిజిస్ట్రేషన్ లతో పాటు ఇతర అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చట్ట పరంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ని ప్రక్షాళన చేసి పునర్వైభవం తీసుకువస్తామన్నారు. క్రీడల్లో ఎక్కడ రాజకీయాలకు చోటు ఇవ్వకుండా రాష్ట్రంలో క్రీడాభివృద్ది చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. రాష్ట్రంలో జాతీయ క్రీడలు జరిగేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడాభివృద్దితో పాటు యువతలో మానసిక వికాసం, మానసిక స్థైర్యం పెంచటమే ఎన్డీయే కూటమి ఉద్దేశ్యమని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
Prajavartha Online Telugu News