-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. హాస్టళ్లల్లో విద్యార్థులను కంటికి …
Read More »Monthly Archives: August 2024
శిశు సంరక్షణ కేంద్రాలు నిర్వహణకు చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరి…
-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో శిశు సంరక్షణ పునరావాస కేంద్రాలు నిర్వహణ కోసము తప్పని సరిగా చట్టబద్ధ ప్రభుత్వ నియమ నిబంధనలుకు లోబడి అనుమతులు తీసుకొని నిర్వహించాలని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో కొంతమంది ప్రభుత్వ నియమ నిబంధనలుకు విరుద్ధంగా స్వచ్ఛంద సేవలు ముసుగులో నిరుపేద,అనారోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులు యొక్క పిల్లలను గుర్తించి వారిని చూపించు స్వదేశీ , విదేశీ …
Read More »మహిళల భద్రత మనందరి బాధ్యత… : మంత్రి అనిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల భద్రత, మనందరి బాధ్యత అని రాష్ట్రం హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వాసవ్య మహిళా మండలి, లేడీస్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ, రోటర్ క్లబ్ ఆఫ్ అమరావతితో పాటుగా వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ మంగళవారం రాత్రి జరిగింది. బందరురోడ్డులోని డీవీ మానర్ దగ్గర మొదలైన కొవ్వొత్తుల ర్యాలీ టిక్కిల్ రోడ్డు మీదుగా మదర్ థెరీసా …
Read More »ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తాం… : బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిఎస్ ఆర్టీసీ లో పేరుకుపోయిన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్ధితి గత అయిదు సంవత్సరాలు గా ఇదే స్ధితి కొనసాగిందని ఆర్టీసీ యూనియన్ నేతలు బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు ముందు వాపోయారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి వారధిలో విష్ణుకుమార్ రాజు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసి లో ని వివిధ హోదాలకు సంబందించిన యూనియన్ నేతలు తమ సమస్యలు ఏకరవు పెట్టారు. ఆర్టీసి డ్రైవర్లు ఈ టిక్కెట్ మిషన్ …
Read More »రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగమొచ్చింది
– ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలి – వారానికి ఒక్కరోజైనా ఈ వస్త్రాలను ధరించాలి – రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగమొచ్చిందని..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి కృషిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా …
Read More »ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ
– ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ – నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపర చర్యలు – రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి ఆధునిక సాంకేతికతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో …
Read More »విజయవాడలో మినీ జాబ్ మేళా..!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22వ తేదీన అనగా గురువారం జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా ప్రభుత్వ ఐటిఐ కాలేజి ఆవరణలో జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ …
Read More »ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే
– మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తప్పవు – ఆప్షన్-3 ఇళ్ల ఏజెన్సీలతో త్వరితగతిన పనుల పూర్తిపై పటిష్ట పర్యవేక్షణ అవసరం – 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పరిధిలోని లక్ష్యాల పూర్తికి చర్యలు తీసుకోవాలి – మిగిలిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి సమన్వయంతో పనిచేయాలి – ఎన్‌టీఆర్ జిల్లా గృహ నిర్మాణ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి …
Read More »ఘనంగా జెసి తేజ్ భరత్ కు వీడ్కోలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా బదలీ పై వెళ్ళిన జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ జిల్లాకు అందించిన సేవలు సర్వదా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జెసి కి జిల్లా అధికారులు, సిబ్బంది సన్మానించడం జరిగింది. జిల్లాలో పనిచేసిన 18 నెలల కాలంలో మరిచిపోలేని అనుభూతి కలిగించిందని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా వెళుతున్న ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. తాను జాయింట్ కలెక్టర్ …
Read More »ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం
-పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో మంగళవారం కమిషనరేట్ పరిధిలోని డిప్యూటి పోలీస్ కమీషనర్లు, అన్ని డివిజన్ల అసిస్టెంట్ పోలీస్ కమీషనర్లు, ఇనస్పెక్టర్లు మరియు ఎస్.హెచ్.ఓ.లతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్., నేర సమీక్షా సమావేశం నిర్వహించి మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి, మద్యం అక్రమ రవాణా అరికట్టడం, …
Read More »