విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏ.పి పోలీస్ సంయుక్త ఆద్వర్యంలో రేపు 20.08.2024 (మంగళవారం) సాయంత్రం 7.00 గంటలకు కాండిల్ ర్యాలి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ కలకత్తా లో డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఈ ర్యాలిని నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగళపూడి అనిత వస్తున్నారని ఆమె అన్నారు. ఈ ర్యాలి …
Read More »Monthly Archives: August 2024
రూ.220 కోట్ల వ్యయంతో ఇంటింటికి రక్షిత మంచినీరు
-రూ.160 కోట్లతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన -ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పట్ల అత్యధిక ప్రాధాన్యతతో నిర్ణీత గడువు దాటకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం కార్యక్రమం ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి మచిలీపట్నం ఆర్డిఓ ఎం వాణిలతో కలిసి నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా ఆలకించి సంబంధిత …
Read More »ఫోటోగ్రఫీలోని నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
-మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ఫోటోగ్రఫీలోని నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని, జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో గల కెమెరా సృష్టికర్త లూయిస్ జాక్వెస్ మండే …
Read More »కారకంపాడులో శివాలయం శంకుస్థాపనలో పాల్గొన్న గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు
మొవ్వ (కారకంపాడు), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ శుద్ధ పూర్ణిమ సోమవారం ఉదయం గం.08.51ని.లకు శ్రవణా నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశ శుభముహూర్తము నందు బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీముఖ లింగేశ్వర స్వామి వారి ఆద్యేష్టికోపధాన (శంఖుస్థాపన) కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక హోమం, పూజలు …
Read More »దోమల నియంత్రణకు తరచుగా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధులను నియంత్రించేందుకు, దోమల నియంత్రణ ఎంతో ముఖ్యమైనదని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తన పర్యటనలో కనకదుర్గ నగర్, బుడమేరు కాలువలో ఉన్న నీటి పైన ఎంఎల్ ఆయిల్ తో డ్రోన్ ద్వారా స్ప్రే చేయమని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, తన పర్యటనలో భాగంగా సర్కిల్ 3 పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్, కనకదుర్గ నగర్, గుణదల వద్ద గల మేజర్ …
Read More »పవన్ కళ్యాణ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కచెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి శ్రీ గద్దరన్న పాడినట్టు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో.. అక్క నుదుటున తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో! అదే విధంగా అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప! అటువంటి అనురాగానికి ప్రతీకైన రక్షా బంధన్ పండుగ శుభ తరుణాన సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ వేడుకను …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రాఖీ పండుగ శుభాకాంక్షలు
-ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు …
Read More »రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం చంద్రబాబు రేపు (సోమవారం) తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1,213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రేపటి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. కాగా, చంద్రబాబు రేపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు. ఇక్కడి సోమశిల …
Read More »తుంగభద్ర డ్యాంకు స్టాప్ లాగ్ ఏర్పాటులో విజయవంతం చేసిన అందరికీ అభినందనలు
-సంపద సృష్టించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ఇకనైనా దృష్టి పెట్టండి -ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19 గేటు ద్వారా రిజర్వాయర్ నుండి తరలిపోతున్న నీటిని నిలువరించడానికి స్టాప్ లాగ్ గేట్లను సమర్థవంతంగా అమర్చిన సాంకేతిక నిపుణులకు, అందుకు సహకరించిన తుంగభద్ర జలమండలికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామి రెడ్డి అభినందనలు తెలియజేశారు. రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంత రైతుల నీటి అవసరాలను …
Read More »