విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈనెల 10వ తేదీన శనివారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని , నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 3000 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరములకు 7032399488, 6281103122 అనె నెంబర్లని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
Read More »Monthly Archives: August 2024
కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ కళాశాలలు
-జూనియర్ కళాశాల కి ఎమ్మెల్యే సుజనా వరాల జల్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ లోని ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్ది ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతుల అభివృద్ధికి కృషి చేస్తానని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. గురువారం 45వ డివిజన్ కబేళా ప్రాంతంలోని, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేశారు. అనంతరం డిఐఈఓ సిఎస్ఎస్ఎన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ షేక్ అహ్మద్, మరియు, అధ్యాపకులతో ముఖాముఖి చర్చించి కళాశాల …
Read More »ప్రజా ఆరోగ్య పారిశుద్ధ్య నిర్వహణకు భంగం కలగకుండా చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ప్రజారోగ్య పారిశుద్ధ్య నిర్వహణకు భంగం కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తమ చాంబర్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, పందుల పెంపకం యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పందులు సంచరించకుండా, పందుల యజమానులు, తమ పందులను రోడ్లపై సంచరించకుండా …
Read More »APIIC కాలనీ ప్రజల సమస్యలను తీర్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ, ఐల కమిషనర్ల సంయుక్త పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాల సంస్థకు, ఐలకు ( ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) సరిహద్దు ప్రాంతంగల APIIC కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఐలా కమిషనర్ మధు, గురువారం ఉదయం సంయుక్తంగా పరిశీలించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్డు మీద రాకుండా ఉండేందుకు , ఐలా వారు డ్రైనలలో డీసిల్టింగ్ చేస్తూ ఉండాలని, తద్వారా వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన నిలవకుండా డ్రైన్లలో వెళ్లిపోయి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉంటుందని …
Read More »RRR విజ్ఞాన కేంద్రం, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ లోని RRR విజ్ఞాన కేంద్రం, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ( ఎక్సెల్ ప్లాంట్ ) పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా RRR విజ్ఞాన కేంద్రం సందర్శించి, అందులో ఉన్న వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎక్స్పీరియన్స్ సెంటర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తదుపరి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో …
Read More »వయనాడ్ బాధితులకు సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి చేయూత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రకృతి విలయ దుర్ఘటన యావత్తు ప్రపంచాన్ని కదిలించిందని, ఇలాంటి సమయంలో ఇతోధికంగా తోడ్పడాల్సిన మోదీ ప్రభుత్వం విపత్తును కూడా రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నించటం బీజేపీ రాజకీయ దుర్భలత్వానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. వయనాడ్ వరద విలయ బాధితుల సహాయార్థం సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సేకరించిన వస్తువులను గురువారం లారీల ద్వారా కేరళకు పంపారు. ఈ సందర్భంగా విజయవాడ సీపీఐ రాష్ట్ర …
Read More »ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ dr సిస్టర్ జె సింత క్వాడ్రాస్ చేనేత సుహృద్భావ ర్యాలీ నీ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చేనేతలు భారత దేశ గర్వ కారణమైన కళా సంపద అని చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ముఖ్య అతిథి గా లయోలా కళాశాల ఏవియేషన్ విభాగ అధ్యపకురాలు T.నిష విచ్చేశారు. ఆమె చేనేత రంగం ప్రాధాన్యతను మరియు ప్రపంచీకరణ వల్ల మచనిసేషన్ వల్ల ఆ రంగం ఎదుర్కొంటున్న …
Read More »బిడ్డకు తల్లిపాలు మించిన ఔషదం లేదు..
-ప్రైవేట్ ప్లేస్కూల్స్‌కి ధీటుగా అంగన్‌వాడీలలో మౌళిక వసతులు అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి -శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుట్టిన బిడ్డకు తల్లిపాలకు మించిన ఔషదం మరోకటి లేదని రోగనిరోధక శక్తికి తల్లిపాలు ఎంతో దోహదపడుతాయని ప్రతి ఒక్కరు పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దెరామ్మోహన్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ …
Read More »సిఎం దృష్టికి రియల్ ఎస్టేట్ రంగ సమస్యలు
-సిసోడియాను కలిసిన నారెడ్కో ప్రతినిధి బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ విభాగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సిసోడియాను కలిసి రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించింది. నారెడ్కో బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధరరావు, సెక్రటరీ జనరల్ సీతారామయ్య, …
Read More »భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపొందించండి..
-స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించాలి.. -ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకోండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పూర్తి మౌళిక వసతులను కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు భవిష్యత్ అవసరాలు ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గ్రామాల సమగ్రాభివృద్దికి చేపట్టవలసిన ప్రణాళికలపై బుధవారం జిల్లా కలెక్టర్ …
Read More »