Breaking News

APIIC కాలనీ ప్రజల సమస్యలను తీర్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ, ఐల కమిషనర్ల సంయుక్త పరిశీలన

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాల సంస్థకు, ఐలకు ( ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) సరిహద్దు ప్రాంతంగల APIIC కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఐలా కమిషనర్ మధు, గురువారం ఉదయం సంయుక్తంగా పరిశీలించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్డు మీద రాకుండా ఉండేందుకు , ఐలా వారు డ్రైనలలో డీసిల్టింగ్ చేస్తూ ఉండాలని, తద్వారా వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన నిలవకుండా డ్రైన్లలో వెళ్లిపోయి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉంటుందని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి చిట్టినగర్ పర్యటించి, కొండ ప్రాంత ప్రజలకు సురక్షితమైన ప్రాంతాలకు తరలిరావాలని నోటీస్లు జారీ చేయమని, మిగిలి ఉన్న కంచెపనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో నాలుగో డివిజన్ కార్పొరేటర్ జాస్తీ సాంబశివరావు, చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ చీరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *