Breaking News

Daily Archives: September 18, 2024

పిలుపిచ్చిన ప్రభుత్వం…కదిలొస్తున్న దాతలు

-వరద బాధితుల సహాయార్ధం సీఎం చంద్రబాబుకు పలువురు చెక్కుల అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు విరాళాలు ఇవ్వ‌డానికి ప‌లువురు దాత‌లు ముందుకొస్తున్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపుతో స్పందించిత‌న దాత‌లు, ప్ర‌ముఖులు, పారిశ్రామిక, వ్యాపార‌, విద్యా, వాణిజ్య సంస్థ‌ల‌కు చెందిన వారు బుధ‌వారం స‌చివాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందించ‌డానికి ముందుకొచ్చిన దాత‌ల‌ను సీఎం అభినందించారు. విరాళాలు అందించిన వారిలో… 1. డాక్టర్ వసంతరావు పాలపల్లి, అల్ట్రాటెక్ సిమెంట్స్ రూ.2 కోట్లు …

Read More »

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త మద్యం పాలసీకి ఆమోదం

-అక్టోబర్ మొదటి వారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలు -చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు ఆమోదం -రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు -వాలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కోసం నెలనెలా ఇచ్చే రూ.200/-జీవో రద్దు -భోగాపురం ఎయిర్ పోర్టుకు “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” గా నామకరణం -ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (స్టెమీ), రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాలు ప్రారంభం -రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్—సర్వీస్‌మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEXCO) ఏర్పాటు -1 …

Read More »

బీసీల పక్షపాతి చంద్రబాబు

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలకు టీడీపీతోనే మేలు కలుగుతోందన్న విషయం మరోసారి రుజువైందని, వెనుకబడిన తరగుతల పక్షపాతి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముంగిట వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. …

Read More »

చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు…

నర్సీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయబడినవి, అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ క్యాంటిన్లను నిలిపివేసింది. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. ఈ అన్న క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలు హరేరామ హరికృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు నిలిపివేయడంతో స్వంత నిధులతోనే అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో చింతకాయల పద్మవతి, రెండు రూపాయలకే అన్న క్యాంటిన్ …

Read More »

ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక

నర్సీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక. దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదు, అంటూ భావోద్వేగంతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ్ కృష్ణణ్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆస్పత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే, నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడం తన లక్ష్యమని పేర్కొన్నారు. తన హాయాంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి, లిప్ట్, …

Read More »

రుణాల రీషెడ్యూలింగ్ అవ‌కాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల‌కు లబ్ధి చేకూర్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని రుణాల రీషెడ్యూలింగ్ అవ‌కాశం క‌ల్పించాయని దీనిపై సంబంధిత బ్యాంకు బ్రాంచీలను సంప్రదించి లబ్ది పొందాలని అడిషనల్ సెక్రటరీ (ఫైనాన్స్) జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రుణాల చెల్లింపుల‌కు సంబంధించి ఏడాది పాటు మార‌టోరియం సౌక‌ర్యం క‌ల్పించాయని. పంట రుణాలు, ఆటో రిక్షా, ద్విచ‌క్ర‌వాహ‌నాల రుణాలు; చిన్న వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు, కిరాణా షాపులు, హోట‌ళ్లు, ఇత‌ర చిన్న ప‌రిశ్ర‌మ‌లకు ఈ మార‌టోరియం వ‌ర్తిస్తుందన్నారు. వ‌ర‌ద …

Read More »

బుడ‌మేరు కాలువ పూర్తి విస్తీర్ణ వివరాల నివేదికివ్వండి

– స‌ర్వే నంబ‌ర్ల వారీగా రూరల్, అర్బన్, నగర పరిధిలో వివ‌రాల‌ను స‌మ‌ర్పించండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడ‌మేరు వ‌ర‌ద ముంపు నుంచి జిల్లా,నగరానికి శాశ్వ‌త ప‌రిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌ని, దీనిలో భాగంగా స‌ర్వే, ల్యాండ్ రికార్డ్స్‌; ఇరిగేష‌న్‌, వీఎంసీ సిటీప్లానింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్ర‌స్థాయిలో వాస్తవ ‌ సర్వేనంబ‌ర్ల‌తో స‌హా ఎంత మేరకు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైనది సంబంధిత పూర్తినివేదిక స‌మ‌ర్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌ల …

Read More »

ఆక‌స్మిక వ‌ర‌ద‌లు ప్ర‌జా జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేశాయి

– వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ఎస్‌టీల జీవ‌నోపాధిని దెబ్బ‌తీశాయి. – ముంపుతో సంభ‌వించిన క‌ష్ట‌న‌ష్టాల‌పై ప్ర‌భుత్వానికి స‌మ‌గ్ర నివేదిక‌ – ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వానికి క‌మిష‌న్ త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు – రాష్ట్ర ఎస్‌టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ డా. డీవీజీ శంక‌రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, ఆక‌స్మిక వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌తో పాటు ప‌రిసర ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేశాయ‌ని… ఎస్‌టీల జీవ‌నోపాధిని బాగా దెబ్బ‌తీశాయ‌ని, వాస్త‌వ స్థితిగ‌తుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌గ్ర నివేదిక అంద‌జేయ‌నున్న‌ట్లు …

Read More »

గుడివాడలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై సైకిల్ ర్యాలీ..

గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాహి సేవా పక్షోత్సవాలు” సందర్భంగా బుధవారం ఉదయం గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అడుసుమిల్లి గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల, శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాల 100మంది …

Read More »

మేధోపరమైన సంపత్తి హక్కులు (IPR) అమలు మరియు సామర్థ్య పెంపు పై పాలసముద్రంలోని NACINలో మూడు రోజులపాటూ జరగనున్న జాతీయ సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నులు మరియు సుంకాల కేంద్ర బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ -CBIC) ఆధ్వర్యంలోని సుంకాలు, పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల జాతీయ అకాడమీ (NACIN), కొత్త క్యాంపస్‌లో భారత ప్రభుత్వంతో కలిసి మేధోపరమైన సంపత్తి హక్కులు (IPR) అమలు మరియు మేధో సామర్థ్యాల పెంపుదలపై మూడు రోజుల జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్‌లోని పాలసముద్రంలో నిర్వహిస్తోంది. ఈ సదస్సును శ్రీ. సుర్జిత్ భుజబల్, సభ్యుడు (కస్టమ్స్), CBIC, ప్రారంభించారు. IPR …

Read More »