మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్య సేవలు శాఖ మంత్రి మరియు కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ఇంచార్జ్ మంత్రి సోమవారం స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ …
Read More »Daily Archives: November 4, 2024
ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 14 ఫిర్యాదులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 14 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు …
Read More »జిల్లా కలెక్టర్ గారిని కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కమిటీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ని కలవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి బాలచంద్ర, కోశాధికారి చంద్రబాబుతో పాటు ఉపాధ్యక్షులు ప్రకాష్ బాబు, జాయింట్ సెక్రెటరీ మాధవ్, ఈసీ మెంబర్లు కలెక్టర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ప్రెస్ క్లబ్ నిర్వహణ వ్యవహారాలపై ఆరా తీశారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఎన్నికల నిర్వహణ …
Read More »రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది : ఎంపి కేశినేని శివనాథ్
-ఐ.టి.టి ల్యాబ్స్ ప్రారంభోత్సవానికి హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షత తో రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది సాధించనుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటో మొబైల్ ఇండస్ట్రీ నుంచి టూరిజం వరకు అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. భవిష్యత్తులో చార్టెడ్ ఎకౌంటెట్స్ అవసరం చాలా వుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గవర్నర్ పేట లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ …
Read More »మహిళలకు 33 శాతం రిజర్వేషన కల్పించాలి
-ఎంపి కేశినేని శివనాథ్ కి వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పంచదార్ల దుర్గాంబ కోరారు..ఈ మేరకు సోమవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ఎంపి కేశినేని శివనాథ్ ను తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి సహకారంతో కలిసి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పై కూటమి పార్లమెంటు …
Read More »మూలపాడు స్టేడియంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు కృషి : ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్
-మూలపాడు క్రికెట్ స్టేడియం సందర్శన -త్వరలో గోల్ఫ్ కోర్స్ వచ్చే అవకాశం -రూరల్ ప్రాంతాల్లో ఎసిఎ తరుఫున క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూలపాడులోని క్రికెట్ స్టేడియంలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయటానికి సన్నహాలు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటుకి సంబంధించి డిజైన్లు తయారు చేసి ఏడాదిలోపు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని …
Read More »కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి… : మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప.గో, పల్నాడు జిల్లాల ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో సోమవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రెండు జిల్లాలకు ఇంచార్జ్ మంత్రిగా హోదాలో ఇరు జిల్లాల నాయకులతో మాట్లాడారు. గ్రాడ్యూయేట్ ఓటర్ల నమోదు పై స్థానిక ఎమ్మెల్యేలు, కూటమి నేతలు దృష్టి పెట్టాలని కోరారు. ఓటరు నమోదులో సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కూటమి నేతలకు సూచించారు. గతంలో మాదిరిగానే పట్టభద్రుల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తంగా …
Read More »కోడెలకు టీడీపీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది
-కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదు -కోడెల విగ్రహం దొంగచాటుగా పెట్టాల్సిన అవసరం లేదు -ఘనంగా కోడెల విగ్రహాన్ని అందరి సమక్షంలో ఆవిష్కరిస్తాం – మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కోడెల చేసిన సేవలు వెల కట్టలేనివని పేర్కొన్నారు. కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదని …
Read More »ఇంటింటి స్కిల్ సర్వే పక్కాగా చేసి, ఆన్ లైన్ యాప్ లో నమోదు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా ఇంటింటి స్కిల్ సర్వే పక్కాగా చేసి, ఆన్ లైన్ యాప్ లో నమోదు చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు తెలిపారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో యువత నైపుణ్యం పై చేపట్టనున్న సర్వే పై వార్డ్ సచివాలయ కార్యదర్శులకు సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ …
Read More »ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి వారానికి పరిష్కారం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి వారానికి పరిష్కారం చేయాలని, తమ రోజువారీ క్షేత్ర స్థాయి పర్యటనల్లో సదరు ఫిర్యాదులను నేరుగా పరిశీలిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »