Breaking News

Daily Archives: November 6, 2024

మంత్రి సవిత మానవత్వం

-తాడేపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం -నలుగురు మహిళలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -ఒకరి పరిస్థితి విషమం -క్షతగాత్రులను దగ్గరుండి తన వాహనంలో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించిన మంత్రి సవిత -ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారికి పరామర్శ -మెరుగైన వైద్యమందించాలని వైద్యులకు ఆదేశం అమరావతి/తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళలను తన వాహనంలో స్వయంగా దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. …

Read More »

ఉచిత మెగా డి.ఎస్.సి కోచింగ్ కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలి

-అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి -జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత మెగా డి.ఎస్. సి కోచింగ్ కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో త్వరలో మెగా డి.ఎస్.సి నోటిఫికేషన్ రానున్న సందర్భంగా ఉచిత కోచింగ్ నిర్వహణకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఎస్.సి, ఎస్. టి అభ్యర్థులకు …

Read More »

ఎంపీ లాడ్స్, నరేగా, డిఎంఎఫ్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు కాబడిన పనులు, జిల్లా మినరల్ ఫండ్స్ (DMF) , ఎం పి ల్యాండ్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసి పురోగతిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి …

Read More »

తడ లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తడ లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Tada) నందు 08-11- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: Govt ITI, Tada, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన శ్రీ సిటీ కి సంబంధించి వెర్మేరియన్ …

Read More »

విద్యార్థులకు అపార్ నమోదు వేగవంతం చేసి ఈ నెల నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు అపార్ నమోదు ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లాలోని డిఈఓ, ఎంపిడిఓ లు, డిప్యూటీ ఈఓలు , ఎంఈఓ లతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం -2020 లో భాగంగా భారత …

Read More »

నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతాం

-వడమాల పేట మండలంలో మూడున్నర ఏళ్ల బాలిక పై జరిగిన అఘాయిత్యానికి ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నది : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో మూడున్నర ఏళ్ల బాలిక పై జరిగిన అఘాయిత్యానికి ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నదనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. నేటి బుధవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర …

Read More »

జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు కిషోర్ వికాస్ పథకంను పటిష్టంగా అమలు చేయాలి

-పోషణ ట్రాక్ యాప్ లో పిల్లల డేటా ఖచ్చితంగా ఉండేల చూసుకోవాలి -పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు కిషోర్ వికాస్ పథకం అమలు, పోషకాహార లోపం నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపీఓ లు, సూపర్వైజర్లు …

Read More »

టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బి.ఆర్.నాయుడు బుధవారం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ  బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు బి.ఆర్.నాయుడుకు స్వాగతం పలికారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జె.శ్యామలరావు బి.ఆర్.నాయుడు తో ప్రమాణం చేయించారు. అనంతరం …

Read More »

పశు గణన పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా ఆన్ లైన్ సర్వే

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ నెల 1 నుండి 21వ అఖిల భారత పశు గణన పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా ఆన్ లైన్ సర్వే జరుగుతుందని, నగర ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి తగిన వివరాలు అందించి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 1 నుండి 2025 ఫిబ్రవరి …

Read More »

నవంబర్ నెలాఖరు నాటికి రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడమే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ నెలాఖరు నాటికి రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలో జరుగుతున్న మరమత్తు పనుల పై డివిజన్ల వారీగా ఇంజినీరింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రహదారులపై వార్డ్ సచివాలయాల వారీగా 3 వేల వరకు ప్యాచ్ లు, …

Read More »