Breaking News

ఎంపీ లాడ్స్, నరేగా, డిఎంఎఫ్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు కాబడిన పనులు, జిల్లా మినరల్ ఫండ్స్ (DMF) , ఎం పి ల్యాండ్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసి పురోగతిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులు, జిల్లా మినరల్ ఫండ్స్(DMF ), ఎంపీ లాండ్స్ పనుల పురోగతిపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గనులు, భూగర్భ శాఖ, సి పి ఓ సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తూ.. జిల్లా లో జిల్లా మినరల్ ఫండ్స్(DMF ), ఎంపీ లాండ్స్ పనుల పురోగతిపై సమీక్షిస్తూ ప్రారంభ దశ లో ఉన్న పనులు మరియు, మిగిలిన పనులలో పురోగతి సాధించి, త్వరితగతిన పూర్తి చేసేల చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ తెలుగంగ, జి ఎన్ ఎన్ ఎస్ మదన్ గోపాల్, ఎస్ ఈ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి రామ్మోహన్,డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *