Breaking News

నవంబర్ నెలాఖరు నాటికి రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడమే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ నెలాఖరు నాటికి రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలో జరుగుతున్న మరమత్తు పనుల పై డివిజన్ల వారీగా ఇంజినీరింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రహదారులపై వార్డ్ సచివాలయాల వారీగా 3 వేల వరకు ప్యాచ్ లు, రోడ్ మరమత్తులను చేయాల్సిన వాటిని గుర్తించామని, వాటికి డివిజన్ల వారీగా షుమారు రూ.2.56 కోట్లతో అంచనాలు సిద్దం చేసుకొని, డిశంబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో మరమత్తులు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. ఇప్పటికే షుమారు 12 వందల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేశామన్నారు. బ్రాడీపేట 4వ లైన్ లో నూతన బిటి రోడ్ ని ఎండ్ టు ఎండ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నందివెలుగు రోడ్ ఏర్పాటుపై సంబందిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశామన్నారు. అలాగే నగరంలోని నల్లచెరువు మెయిన్ రోడ్, విఐపి రోడ్, పాత గుంటూరు బాలాజీ నగర్, తారకరామ నగర్, అంబేద్కర్ నగర్, ఆనందపేట, సంగడి గుంట, లాంచేస్టర్ రోడ్, ఐపిడి కాలనీ, ఎస్విఎన్ కాలనీ, బ్రాడిపేట బ్రిడ్జి సర్వీస్ రోడ్లు, ముత్యాల రెడ్డి నగర్, దేవాపురం, కోబాల్ట్ పేట వంటి పలు ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన రోడ్ మరమత్తు పనులు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు. రోడ్ మరమత్తులతో పాటుగా ఎక్కడైనా ప్రజల అవసరాల రీత్యా నూతన డ్రైన్లు, కల్వర్ట్ ల నిర్మాణ అవసరాలను గుర్తిస్తే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించామని తెలిపారు. ఏఈల వారీగా ప్యాచ్ వర్క్ పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని, లోపాలు వస్తే సంబందిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు భాధ్యత వహించాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *