-అధికారులకి ఎలాంటి అపాయం జరిగినా బెదిరించిన వారిదే బాధ్యత -ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదు -ఇంకోసారి ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే సమోటోగా కేసులు -గత ముఖ్యమంత్రి పర్యటనల్లో చెట్ల నరికివేతపై వాల్టా చట్టం కింద చర్యలు -అటవీ అమర వీరుల త్యాగాలు వృథా కానివ్వం -భావితరాలు గుర్తుంచుకునేలా విగ్రహాల ఏర్పాటు… భవనాలకు అమర వీరుల పేర్లు -గుంటూరు అరణ్యభవన్ లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »Daily Archives: November 10, 2024
పవన్ కళ్యాణ్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారికి వివరించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశమైన సమావేశంలో అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ కి కి గ్రామపంచాయతీలు మరియు గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దాదాపు 26 డిమాండ్లను వారి …
Read More »రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీకి వర్ష ముప్పు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Read More »అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీం జీవోను అమలు చేయాలి
-APUWJ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల హౌసింగ్ స్కీం విషయంలో గతంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ పేరిట ఇచ్చిన జీవోను పునరుద్ధరించాలని ఏపీయుడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఏపీయుడబ్ల్యూజె విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం ఆదివారం అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు పాల్గొని కొత్త అక్రెడిటేషన్లు, జర్నలిస్టుల హౌసింగ్ స్కీం తదితర …
Read More »ప్రి రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎంపికైన ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 12 నుండి 21 వరకు జరిగే ప్రి రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ కంటేజెంట్ లీడర్ గా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉత్తర్వులు పంపారు. ఈ సంవత్సరం జరిగే ప్రి రిపబ్లిక్ డే …
Read More »చేనేతలను అన్ని విధాల ఆదుకుంటాం
-కొలనుకొండలో పద్మశాలి భవన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి-విజయవాడ బైపాస్ లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్(PIWA) ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీ భవన్ కు శంకుస్థాపన చేశారు. పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ …
Read More »నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
-పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలి -పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చాం -30 వేల దరఖాస్తులు పరిశీలించి…తగిన వ్యక్తికి తగిన గౌరవం విధానంతో అవకాశం కల్పించాం. -వేధింపులకు గురైన వారికి, మహిళలు, యువతకు అవకాశాలు….సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు -పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఎంపికలు…పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి -నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమై 11 రోజులు కొనసాగే అవకాశాలున్నాయి.
Read More »శ్యావల దేవదత్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులైన శ్యావల దేవదత్ కు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను శ్యావల దేవదత్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్యావల దేవదత్ కు అభినందనలు తెలపటంతో పాటు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ప్రజలకి మరింత సేవ చేసి మరిన్నీ ఉన్నత పదవులు …
Read More »మారుతీ కో-ఆపరేటివ్ కాలనీ ఉద్యానవనం సందర్శించిన ఎంపి కేశినేని శివనాథ్
-త్వరలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పటమట ప్రాంతంలోని 10వ డివిజన్ గల అక్కినేని పూర్ణచంద్రరావు నగరపాలక సంస్థ ఉద్యానవనం ను ఎంపి కేశినేని శివనాథ్ సందర్శించారు. ఆ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ ఆ ఉద్యానవనంలో ఆగిపోయిన పనులు, కావాల్సిన సుదుపాయాలు ఎంపి కేశినేని శివనాథ్ కి వివరించారు. అలాగే ఉద్యానవనంలో వున్న కమ్యూనిటీ హాల్ ను కూడా చూపించి అభివృద్ది చేయావల్సిందిగా కోరారు. ఉద్యానవనంలో వాకింగ్ ట్రాక్ , ఓపెన్ కోర్ట్ ఏర్పాటు చేయటంతో …
Read More »