Breaking News

మారుతీ కో-ఆప‌రేటివ్ కాల‌నీ ఉద్యాన‌వనం సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభించే విధంగా చ‌ర్య‌లు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌ట‌మ‌ట ప్రాంతంలోని 10వ డివిజ‌న్ గ‌ల అక్కినేని పూర్ణ‌చంద్ర‌రావు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉద్యాన‌వ‌నం ను ఎంపి కేశినేని శివ‌నాథ్ సంద‌ర్శించారు. ఆ డివిజ‌న్ కార్పొరేట‌ర్ దేవినేని అప‌ర్ణ ఆ ఉద్యాన‌వ‌నంలో ఆగిపోయిన ప‌నులు, కావాల్సిన సుదుపాయాలు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి వివరించారు. అలాగే ఉద్యాన‌వ‌నంలో వున్న క‌మ్యూనిటీ హాల్ ను కూడా చూపించి అభివృద్ది చేయావ‌ల్సిందిగా కోరారు. ఉద్యాన‌వ‌నంలో వాకింగ్ ట్రాక్ , ఓపెన్ కోర్ట్ ఏర్పాటు చేయ‌టంతో పాటు చ‌క్క‌టి స‌దుపాయాలు వుండే విధంగా అభివృద్ది జ‌రిపిస్తామ‌న్నారు. కాంట్రాక్ట‌ర్ తో మాట్లాడి త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ టౌన్ ప్లాన‌ర్ మోహ‌న్ బాబు, టౌన్ ప్లానింగ్ సూప‌ర్ వైజ‌ర్ వ‌సీం బేగ్, మారుతీ కో-ఆప‌రేటివ్ కాల‌నీ ప్రెసిడెంట్, క‌మిటీ స‌భ్యులు కె.జి తిల‌క్, ఎమ్.నాగేశ్వ‌ర‌రావు, ఎస్.ఆర్.ఠాగుర్, పి.సురేంద్ర‌నాథ్, రాజ్ బీహారీ గుప్తా, టి.కృష్ణ‌ప్రసాద్, ఎల్.గురునాథం, జ‌య‌ప్ర‌కాష్‌ ల‌తో త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *