విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ రాజ్య సభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన సానా సతీష్ మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ ను శుక్రవారం గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ కి ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలపటంతో పాటు శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి పత్రిమను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి …
Read More »Daily Archives: December 13, 2024
ఆరు పతకాలు సాధించిన పి.తేజేష్ ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల పొలాచ్చి, తమిళనాడు లో జరిగిన 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు,వెండి, రజతం పతకాలు సాధించిన పి.తేజేష్ ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. అలాగే పి.తేజేష్ అభిరుచి తెలుసుకుని ఆ రంగంలో ప్రొత్సహించినందుకు తండ్రి బాలసుబ్రహ్మాణ్యాన్ని ప్రశంసించారు. ఆర్టిస్టిక్ రోలర్ స్కేటర్ గా బాగా రాణిస్తున్న విజయవాడ అరండల్ పేటకి చెందిన పి.తేజేష్ 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో గెలుపొందిన విషయం తెలుసుకుని శుక్రవారం గురునానక్ కాలనీలోని …
Read More »నేడే జాతీయ లోక్ అదాలత్
-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 14.12.2024 జాతీయ లోక్ అదాలత్ -రెండవ శనివారం ఉదయం 10 గంటల నుంచి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం /కాకినాడ /అమలాపురం /రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కోర్టుల యందు ది. 14.12.2024 న (రెండవ శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుననీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార …
Read More »సంక్షేమ, అభివృద్ది లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలి
-జిల్లా అధికారులు మరింత సమర్థవంతంగా అమలకు కృషి చేయాలి -స్వర్ణ ఆంధ్ర @ 2047 దిశగా అడుగులు వేద్దాం -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను సమర్ధవంతంగా చేపట్టడం కోసం సంతోషమైన, ఆరోగ్యవంతమైన రాష్ట్రమే లక్ష్యంగా మనమందరం పునరంకితం అవుదామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన …
Read More »ఎర్రకాలువ ఆధునీకీకరణకు చర్యలు చేపట్టాలి
-కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ పురందేశ్వరి విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రకాల్వ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎత్తిపోతలను పటిష్టపరిచి, డ్రైనేజీని మెరుగుపరిచి, రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రాజెక్టును ఆధునీకరించాలని, తద్వారా వరదలను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం ఒక విజ్ఞప్తి చేసారు. ఈమేరకు 377 రూల్ ప్రకారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చి, రికార్డు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన కొంగువారిగూడెం గ్రామంలో శ్రీ కరాటం కృష్ణమూర్తి …
Read More »ఈ నెల 14 న సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్. జిల్లా యందు 1978 ప్రాదేశిక నియోజకవర్గాలకు, మరియు 242 సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ కు ఈ నెల 11 వ తేదీన ప్రకటన జారీ చేయబడింది. తదనుగుణంగా ఈ నెల14వ తేది ఉదయం 8.00 గంటలకు ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు మరియు మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాగునీటి సంఘాల అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు జిల్లా కలెక్టర్ మరియు …
Read More »ఆహుతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
-రాష్ట్రంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబంబించేలా ప్రదర్శనలు -కళాకారుల ప్రదర్శనలతో పులకించిన విజయవాడ -చిన్నారుల నృత్యాలతో తన్మయం చెందిన వీక్షకులు -ఆకట్టుకున్న ప్రదర్శనలు -కడుపుబ్బ నవ్వించిన స్కిట్స్, మిమిక్రీ ప్రదర్శనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ మహోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర 2047 విజన్ శుక్రవారం అంగరంగవైభవంగా జరిగింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు …
Read More »వికసిత భారత్ లో ఏపీ మొదటి స్థానంలో నిలవాలి…. : ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్
-రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరం -వ్యవస్థల బలోపేతంతో ప్రజలకు మేలు జరుగుతుంది -భవిష్యత్ ను అంచనా వేయడంలో సీఎం చంద్రబాబు దూరదృష్టి అద్భుతం -గత ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చులతో ప్రజా ఖజానా విచ్ఛిన్నం -ప్రజలు అన్నీ గమనిస్తారు… సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు -శక్తి, సంపద, సమగ్రాభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం -స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ సీఎం మార్క్ -ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ …
Read More »రాష్ట్రం దిశ దశ మార్చేందుకే.. ‘స్వర్ణాంధ్ర-2047’
-తెలుగు జాతిని అగ్రపథాన నిలపడమే ఏకైక లక్ష్యం -రాష్ట్ర జాతీయ ఉత్పత్తి 2.4 ట్రిలియన్ డాలర్లు.., -తలసరి ఆదాయం 42 వేల డాలర్లు.. 2047 నాటికి లక్ష్యాలు -అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేస్తాం -పరిశ్రమలు ఎక్కడొచ్చినా భాగస్వాములుగా స్థానిక రైతులు -క్లీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని సంకల్పం -విజన్ డాక్యుమెంట్‌తో పాటు 20 కొత్త పాలసీలు -అధికారం-అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి -175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు -రేపటి నుంచి ఆంధ్రా వ్యాలీ ఓ సక్సెస్ స్టోరీ అవుతుంది -సంకల్ప …
Read More »ఆల్ ది బెస్ట్.. పరీక్షలంటే భయమొద్దు..
-ఆత్మస్థైర్యం..విజయానికి చిహ్నం -స్వర్ణాంధ్ర @ 2047 ఆవిష్కరణలో నున్న హైస్కూల్ -విద్యార్థులతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాటామంతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏమ్మా బాగున్నారా.. ఏం చదువుతున్నారు.. ఎక్కడ నుంచి వచ్చారు.. అంటూ విజయవాడ రూరల్ మండలం నున్నలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్టేడియం ఆవరణలో ప్రత్యేకంగా …
Read More »