Breaking News

ఈనెల 26 నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ సర్వే నిర్వహిస్తారు

-26వ తేదీ నుండి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అభ్యంతరాల స్వీకరణ
-ఈ అవకాశమును వినియోగించుకోవాలని షెడ్యూల్ కులాలకు చెందిన వారికి విజ్ఞప్తి
-జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 26వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ నిర్వహించుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈనెల 26వ తేదీ నుంచి అన్ని గ్రామా, వార్డు సచివాలయాల్లో షెడ్యూల్ కులాల కుల సర్వే డేటాను ప్రదర్శించాలని, ఈనెల 26 నుండి 31వ తేదీ వరకు ఈ సర్వే డేటా పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో లిఖితపూర్వకంగా తెలియపరచాలని, ఈనెల 26వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలను ఆన్లైన్లో నమోదు చేయడం మరియు డేటాను నిర్ధారణ చేయడం జరుగుతుందని, జనవరి 10వ తేదీన అన్ని గ్రామా వార్డు సచివాలయంలో తుది కుల కులాల సర్వే డేటాను ప్రచురిస్తారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 సంవత్సరంలో జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించిన క్యాస్ట్ సర్వే డేటా ప్రకారం సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు మీ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించిన సర్వే నివేదిక వివరాలను పరిశీలన చేసుకుని నిర్ధారణ చేసుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియచేయాలని కోరారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారందరూ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *