Breaking News

ఈనెల 28వ తేదీన ఏక సభ్య కమిషన్ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఈనెల 28వ తేదీ శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహించి షెడ్యూల్డ్ కులాలలోని ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ షెడ్యూల్ కులాల ఉద్యోగ సంఘాలు, షెడ్యూల్డ్ కులాల సంఘాలు, సంఘ నాయకులు, సంస్థలు, షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు సమర్పించే అర్జీలను స్వీకరిస్తారు. కావున అందరూ సామరస్యంగా ఈ అవకాశమును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *