Breaking News

ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమినేతలు ఘనంగా నిర్వహించారు. 52వ డివిజన్ బిజెపి ఇన్చార్జ్ దొడ్ల రాజా ఆధ్వర్యంలో కొత్తపేట సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద రంగా గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కులం ,మతం, రాజకీయాలకు అతీతంగా సేవలు చేసి రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమినేతలు బొమ్మసాని సుబ్బారావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, బాడిత శంకర్, బోగవల్లి శ్రీధర్, కోప్పిరెడ్డి మూర్తి, షేక్ ఖాదర్, పోతిన భేసు కంటేశ్వరుడు,తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, మరు పిళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో రాయల్ హోటల్ నందు వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అన్నదానం చేసి పండ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలు బాడిత శంకర్, ఉమ్మడి వెంకటేశ్వరరావు, అత్తులూరి పెదబాబు, హర్షద్ తదితరులు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొని స్థానికులకు పండ్లను పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *