విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్. జిల్లా యందు 1978 ప్రాదేశిక నియోజకవర్గాలకు, మరియు 242 సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ కు ఈ నెల 11 వ తేదీన ప్రకటన జారీ చేయబడింది. తదనుగుణంగా ఈ నెల14వ తేది ఉదయం 8.00 గంటలకు ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు మరియు మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాగునీటి సంఘాల అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, ఎన్.టి.ఆర్. జిల్లా వారైన డాక్టర్ జి. లక్ష్మీశ టెలి కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ డివిజనల్ అధికారులకు మరియు తహసిల్దారులకు తగు ఆదేశములను జారీ చేశారు. కావున రైతులందరూ సదరు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించ వలసినదిగా కోరటమైనది.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News