-జిల్లా అధికారులు మరింత సమర్థవంతంగా అమలకు కృషి చేయాలి
-స్వర్ణ ఆంధ్ర @ 2047 దిశగా అడుగులు వేద్దాం
-జెసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను సమర్ధవంతంగా చేపట్టడం కోసం సంతోషమైన, ఆరోగ్యవంతమైన రాష్ట్రమే లక్ష్యంగా మనమందరం పునరంకితం అవుదామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన “స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 “ప్రత్యక్ష ప్రసారం ను జిల్లా అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ లాంఛనంగా . రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవాడలో నిర్వహించడం జరిగిందన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ది లక్ష్యం రాష్ట్ర స్థాయిలో దిశా నిర్దేశనం చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం & మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత , రైతు – వ్యవసాయ సాంకేతికత , ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్) , శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర సాధన అన్ని దశలలో సమగ్ర సాంకేతికత అభివృద్ధిలో మనందరం పునరంకితం అవుదామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, కేఆర్ఆర్సి ఎస్డిసీ డి. ఎస్. భాస్కర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, అంగన్వాడి సూపర్వైజర్లు , స్వచ్ఛంధ సంస్థలు ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News