-విజయవాడ నగర పాలకు సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్థ నిర్వాహణలో విజయవాడలో అగ్రస్థానంలో నిలవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులను ఆదేశించారు. విజయవాడ ను స్వచ్ఛతలో ముందడుగులో ఉంచేందుకు గత ఏడు సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షన్ లో మొదటి స్థానంలో ఉన్న ఇండోర్ నగరము విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులతో పర్యటించారు. ఇండోర్ నగరంలో అమలు చేస్తున్న వ్యర్ధపదార్థాల నిర్వహణను అధికారులతో పరిశీలించారు. వాళ్ళు అమలు చేస్తున్న ఇంటి వద్దనే వ్యర్ధాలను …
Read More »Monthly Archives: December 2024
ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 10 ఫిర్యాదులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు …
Read More »విద్యుత్ ఒప్పందాల రద్దు కోసం ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలి
-కూటమి ఎమ్మెల్యేలు తీర్మానించాలి -సెకీతో ఒప్పందంతో ప్రజలపై లక్షా 10వేల కోట్ల భారం -ప్రజలపై భారాలు యనమల గుర్తెరగాలి -ఆదానీకి దోచిపెట్టిన జగన్ -రైతులు, వలంటీర్లకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి -విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, దాని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, అందులో తీర్మానించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …
Read More »భూపతిరాజు సూర్య నారాయణ రాజు పేరిట ట్రస్ట్
-కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటన భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : నా తండ్రి భూపతిరాజు సూర్యనారాయణ రాజు పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. పార్లమెంటు సభ్యుడు గా వచ్చే బెనిఫిట్ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వినియోగిస్తానని తన తండ్రి సంస్మరణ సభలో ప్రకటించారు. బిజెపి కార్యకర్త గా ప్రస్తానం ప్రారంభించి తండ్రి ప్రోత్సాహం తో ఈ స్థాయికి చేరుకున్నాను అన్నారు. మా కుటుంబం స్వాతంత్ర్య సమరయోధులు కుటుంబం …
Read More »ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్
-మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ -ఐవిఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం -ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు సీఎం విన్నపం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి …
Read More »మైనారిటీ సంక్షేమ శాఖ జీవో-47 ఉపసంహరణ
-వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ …
Read More »జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు చేస్తూ ప్రభుత్వ జీవో ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తెలిపారు. ఇప్పటివరకు పదవి విరమణ వయసు 60 సంవత్సరాలు కాగా, ఒక సంవత్సరం పెంచి పదవీ విరమణ వయసును 61 గా జీవో జారీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ ఉత్తర్వులు 1-11-2024 నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు.
Read More »నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం
–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. అన్న నందమూరి తారాక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరకు రాష్ట్రంలోని పేదలకు టీడీపీ ప్రభుత్వం నిస్వార్థంగా సేవలు అందిస్తోందని అన్నారు. ఆదివారం ఉదయం నియోజకవర్గంలో 3వ డివిజన్‌లో జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె …
Read More »రాబోయే వందేళ్లకు సరిపడా భక్తుల అవసరాలకు సరిపోయే విధంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తాము
-ఎంపీ కేశినేని శివ నాథ్ -శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి పై సమీక్షా సమావేశం -దేవాలయం మాస్టర్ ప్లాన్ పనుల పై చర్చించిన మంత్రి ఆనం, ఎంపి కేశినేని -ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలికిన ఈవో రామారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతి పెద్ద దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే …
Read More »ఈ నెల 2వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »