Breaking News

మైనారిటీ సంక్షేమ శాఖ జీవో-47 ఉపసంహరణ

-వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో-75 విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు.21.10.2023 న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వివిధ రకాల న్యాయపరమైన సమస్యల తలెత్తిన కారణంగ వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన, వివాదాస్పదమైన జీవోను రద్దు చేస్తూ నూతనంగా జీవో నెంబర్ 75 ను ప్రభుత్వం శనివారం జారీ చేసిందని మంత్రి ఫరూక్ తెలిపారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *