Breaking News

Monthly Archives: November 2025

‘దిత్వా’పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం!

-“ప్రభావిత జిల్లాల్లో ప్రసవానికి దగ్గర్లో 7,871 మంది గర్భిణులు ఉన్నట్లు గుర్తింపు -ఆసుపత్రులకు 375 మంది తరలింపు -వైద్య శిబిరాల నిర్వహణకు కూడా సిద్ధం! -ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దిత్వా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో ప్రసవానికి దగ్గర్లో ఉన్న గర్భిణుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తుపాన్ ప్రభావిత జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, కోనసీమ, …

Read More »

గిరిప్రదక్షణ ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది.11.12.2025 నుండి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమం ది.15.12.2025న జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి దీక్షా విరమణ కోసం విజయవాడకు వస్తారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., పోలీస్ అధికారులతో కలిసి టెంపుల్ పరిసర ప్రాంతాలను, గిరి ప్రదక్షణ ప్రాంతాన్ని, స్నాన ఘాట్లను హోమగుండాలు మరియు విరుముడుల స్టాండ్ల …

Read More »

సమాజ హితువు కోరుకునేది కాపు జాతి, కాపుల ఐక్యతతో రాష్ట్ర రాజకీయాలను శాసించొచ్చు – MLA బొండా ఉమ

-కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలి, కాపునాడు స్వర్ణోత్సవ సభలో ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగించిన ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో ఆదివారం కాపునాడు స్వర్ణోత్సవాల వేడుకల సభ జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం నాయకత్వంలో జరగకగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు స్వర్గీయ అమరజీవి స్ఫూర్తి ప్రదాత కాపు జాతి ఆరాధ్య దైవం వంగవీటి మోహన ప్రియ అనుచరులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ …

Read More »

ఉద్భవ్-2025కు ఆతిథ్యానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధం

-శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -ఏర్పాట్లను పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి M.మల్లికార్జన నాయక్ -నిర్వహణ కమిటీలతో సమీక్ష, కీలక ఆదేశాలు జారీ -ఉద్భవ్-2025 ప్రోమో విడుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ జాతీయ సాంస్కృతిక, సాహిత్య మరియు కళా ఉత్సవ్.. ఉద్భవ్ 2025కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలకు వేదికైన గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఏర్పాట్లను …

Read More »

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత యూపీఎస్సి సివిల్స్ కోచింగ్ కి ముగిసిన ప్రవేశ పరీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డా. బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కోసం మొత్తం 6, 361మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు విశాఖ, …

Read More »

ఏపీలో సినిమా, పర్యాటక రంగాల అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి

-డిసెంబర్ 1,2 తేదీల్లో ముంబయిలో జరిగే ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్-2025’లో పాల్గొననున్న మంత్రి -ఫిల్మ్, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కీలకోపన్యాసం చేసి పెట్టబడులను ఆహ్వానించనున్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను సినిమా షూటింగ్‌లకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా “ది ఏఐ ఎరా – బ్రిడ్జింగ్ క్రియేటివిటీ అండ్ కామర్స్” థీమ్ తో డిసెంబర్ 1, 2 …

Read More »

దిత్వా తుపాను తీవ్రత నేపధ్యంలో ఆర్టీజీఎస్ నుండి సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దిత్వా తుపాను తీవ్రత నేపధ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత సచివాలయంలో ఆర్టీజీఎస్ నుండి సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఈరోజు, రేపు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూడటం మన …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …

Read More »

సౌత్ ఇండియా మ్యారేజ్ మీడియేటర్స్ కాన్ఫరెన్స్ – 2025

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పవిత్రక్షేత్రంలోని కచ్ఛప్ ఆడిటోరియం (టుడా ఆఫీస్ వెనుకభాగం) లో నిర్వహించిన సౌత్ ఇండియా మ్యారేజ్ మీడియేటర్స్ కాన్ఫరెన్స్ – 2025 & 5వ వార్షికోత్సవ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక హర్షణీయమైన అంశమని ఆయన …

Read More »

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో…..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 1 సోమవారం ఉదయం 9.30గంటల నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నగరంలోని స్థానిక తుమ్మలపల్లి కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS), వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏకత్వం మరియు సంఘీభావాన్ని ప్రదర్శించడం కార్యక్రమ లక్ష్యం అన్నారు. …

Read More »