Breaking News

గిరిప్రదక్షణ ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది.11.12.2025 నుండి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమం ది.15.12.2025న జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి దీక్షా విరమణ కోసం విజయవాడకు వస్తారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., పోలీస్ అధికారులతో కలిసి టెంపుల్ పరిసర ప్రాంతాలను, గిరి ప్రదక్షణ ప్రాంతాన్ని, స్నాన ఘాట్లను హోమగుండాలు మరియు విరుముడుల స్టాండ్ల ఏర్పాటు, ప్రదేశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గిరిప్రదక్షణ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేయడంతో పాటు, దర్శన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. క్యూలైన్లను, దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను కూడా పరిశీలించి పాటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సారి భవాని దీక్షా విరమణను అత్యుత్తమంగా నిర్వహించేందుకు ఎక్కడా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా ఉండే విధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఎటునుంచి వచ్చిన భక్తులైనా ఒకే సమయానికి అమ్మవారి ధర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లపై చర్చించారు, అదేవిధంగా భవాని భక్తుల సౌకర్యార్ధం రెండు ఫుట్ బ్రిడ్జ్ ల ఏర్పాటుపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్, డి.సి.పి.లు కృష్ణ కాంత్ పాటిల్ ఐ.పి.ఎస్., షీరిన్ బేగం ఐ.పి.ఎస్., ఏ.సి.పి.లు, డి.పావన్ కుమార్, రామ చంద్రరావు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *