-దివ్యాంగులకు త్వరలో ఉచితంగా త్రిచక్ర మోటార్ వాహనాలు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించినందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డీఎస్ బీవీ స్వామికి దివ్యాంగుల కృతజ్ఞతలు అమరావతి / వెలగపూడి సచివాలయం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో …
Read More »Daily Archives: December 23, 2025
ఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మకాలు
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -60, 50, 40 శాతాలపై చేనేత వస్త్రాల డిస్కౌంట్ అమ్మకాలు -గుంటూరు, మంగళగిరిలోని యర్రబాలెంలో 60 శాతం డిస్కౌంట్ పై ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు -50 శాతంపై విజయవాడలోని ఆప్కో మెగా షో రూమ్ లో అమ్మకాలు -మిగిలిన అన్ని ఆప్కో షో రూమ్ ల్లోనూ 40 శాతంపై అమ్మకాలు -26 నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభం -రెండ్రోజుల్లోగా సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోళ్లు ప్రారంభం : మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, …
Read More »వరదనీటిని వాటాగా లెక్కేస్తే నష్టపోతాం
-జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరసరావు పేట, నేటి పత్రిక ప్రజావార్త : వరదల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీటిని సైతం కృష్ణా జలాల్లో వినియోగించుకున్న నీటిగా లెక్కించడం వల్ల రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోవాల్సి వస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ …
Read More »ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశం
-58 రకాల శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు -హర్షం వ్యక్తంచేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్స విధానంతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగు శిక్షణతో శస్త్ర చికిత్స ప్రక్రియకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి, 2020 …
Read More »అధికారులకు హార్టపుల్నెస్ ఇనిస్టిట్యూట్ చే మెడిటేషన్ శిక్షణా కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాదు రామచంద్ర మిషన్- కన్హా శాంతివనం-హార్ట్పుల్నెస్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కమలేశ్ డి.పాటిల్ దాజీ(DAAJI) వారి బృందంచే మంగళవారం ఎపి సచివాలయంలో ఐఏఎస్ అధికారులు,ఇతర విభాగాల అధికారులు,సిబ్బందికి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ మరియు ఇనీషియేటివ్స్,మెడిటేషన్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈశిక్షణా కార్యక్రమంలో మెడిటేషన్ ఇతర ప్రక్రియలు వల్ల కలిగే ప్రయోజనాలు వాటిని ఆచరించాల్సిన విధానాలపై ఆయన వివరించండంతో పాటు సుమారు అర్ధ గంటపాటు అధికారులతో మెడిటేషన్ చేయించారు.అలాగే ధ్యానం ఇతర మూలచక్ర ప్రక్రియలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు …
Read More »సారస్ కు ముమ్మర ఏర్పాట్లు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society – సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన శాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు గుంటూరు కాకాని రోడ్ లో మణిపురం బ్రిడ్జి దగ్గరలో గల గ్రీన్ లీఫ్ టొబాకో త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రదర్శన శాలల ఏర్పాటుకు వేదికగా నిర్ణయించారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ …
Read More »ఎన్ టి ఆర్ జిల్లా రబీ సీజను కు సరిపడా యూరియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : • ఎన్ టి ఆర్ జిల్లా కు రబీ 2025-26గాను, అన్ని పంటలకు అవసరమైన 33,353 మెట్రిక్ టన్నుల యూరియాఎరువు పంపిణీకి ప్రణాళిక చేయడమైనది . • 01.10.2025 నాటికి 2390మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభనిల్వలు అందుబాటులో ఉన్నాయి. • 01.10.2025నుండి31.12.2025 వరకు ఎన్ టి ఆర్ జిల్లా మొత్తం17368 మెట్రిక్ టన్నుల అవసరం కాగా,ఇప్పటికే20422 మెట్రిక్ టన్నుల యూరియా నురైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. • 01.10.2025 నుండి 22.12.2025 వరకు ఎన్ టి ఆర్ …
Read More »జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాతా శిశు సంరక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు మాతా శిశు సంరక్షణకు సంబంధించిన అధికారులకు, ప్రత్యక్షంగాను, జిల్లాలోని వైద్యాధికారులు, జీజీహెచ్ వైద్యాధికారులకు, సీసేహెచ్ వైద్యాధికారులకు, పీహెచ్సీ వైద్యాధికారులకు, యూపీహెచ్సీ వైద్యాధికారులకు, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారాను, మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎక్కువ సంఖ్యలో కాన్పులు జరిగే విధంగా, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కాన్పులు విషయంలో జిల్లా …
Read More »ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనానికి రైతే వెన్నెముక
– నేడు ఆధునిక సాంకేతికత చేయూతతో వ్యవసాయ రంగం ముందుకెళ్తోంది – కిసాన్ సువిధ యాప్‌తో అన్నదాతకు బహుళ ప్రయోజనాలు – జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనానికి రైతే వెన్నెముక అని.. నేడు ఆధునిక సాంకేతికత చేయూతతో వ్యవసాయ రంగం వడివడిగా ముందుకెళ్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్) సందర్భంగా మంగళవారం నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర …
Read More »సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండవ అంతస్థులో గల సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని సెమీ క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ఎల్. స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News