Breaking News

ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు, ప్ర‌జ‌ల జీవ‌నానికి రైతే వెన్నెముక‌

– నేడు ఆధునిక సాంకేతికత చేయూత‌తో వ్య‌వ‌సాయ రంగం ముందుకెళ్తోంది
– కిసాన్ సువిధ యాప్‌తో అన్న‌దాత‌కు బ‌హుళ ప్ర‌యోజ‌నాలు
– జాతీయ రైతు దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు, ప్ర‌జ‌ల జీవ‌నానికి రైతే వెన్నెముక అని.. నేడు ఆధునిక సాంకేతిక‌త చేయూత‌తో వ్య‌వ‌సాయ రంగం వ‌డివ‌డిగా ముందుకెళ్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
జాతీయ రైతు దినోత్స‌వం (కిసాన్ దివ‌స్‌) సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాలలో వృక్ష శాస్త విభాగం ఆధ్వ‌ర్యంలో జాతీయ రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ తాను కూడా ప్లాంట్ ఫిజియాల‌జీలో పీహెచ్‌డీ చేశాన‌ని.. తానూ రైతుబిడ్డ‌నేని, త‌ల్లిదండ్రులు ఇప్ప‌టికీ వ్య‌వ‌సాయం చేస్తూ ఉంటారన్నారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ రంగంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని.. కిసాన్ సువిధ యాప్‌తో పంట‌ను ఏ పురుగులు నాశ‌నం చేస్తున్నాయి? ఏ వాతావ‌ర‌ణానికి ఏ పంట అనుకూలం? అందుబాటులో ఉన్న వ్య‌వ‌సాయ యంత్ర ప‌రిక‌రాలు, వ్య‌వ‌సాయ మార్కెటింగ్‌, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం త‌దిత‌రాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చ‌న్నారు. నేడు క‌చ్చిత‌మైన వ్య‌వ‌సాయం దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతోంద‌ని.. డ్రోన్ సాంకేతిక‌త‌, జీవ‌న ఎరువులు, నానో ఎరువులు త‌దిత‌రాల‌పైనా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడారు. మున్ముందు ఇంకా డ్రోన్‌ల అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంద‌ని.. ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగ అభివృద్ధికి, రైతుల క్షేమం, సంక్షేమానికి వినూత్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌తో కృషిచేస్తోంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు.
కార్య‌క్ర‌మంలో ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ వై.శివ‌శంక‌ర్ మాట్లాడుతూ దైశానికి అన్న‌దాత రైతు అని, రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌న కంచంలోకి అన్నం రాద‌ని, మ‌నం క‌డుపునిండా తింటున్నామంటే అది రైతు వ‌ల్లేన‌ని పేర్కొన్నారు. జాతీయ రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన వ్యాస ర‌చ‌న‌, పోస్ట‌ర్ ప్ర‌జంటేష‌న్‌, వక్తృత్వ పోటీల్లో విజేత‌ల‌కు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బ‌హుమ‌తులు అంద‌జేశారు. అన్న‌దాత‌ల‌ను స‌త్కరించారు.
కార్య‌క్ర‌మంలో క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డా. వీవీఎస్ కుమార్‌, వృక్ష‌శాస్త విభాగం అధ్యాప‌కులు టి.స‌లోమి, బి.శైల‌జ‌, అధ్యాప‌కులు, విద్యార్థినీ విద్యార్థులు తదిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *