Breaking News

Daily Archives: January 6, 2026

నేడు గుంటూరు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు ప‌ర్య‌ట‌న‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. చుట్టుగుంట‌లోని వ్య‌వ‌సాయ శాఖ క‌మీష‌న‌ర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, క‌మీష‌న్ ఏజెంట్స్, అధికారుల‌తో ఉదయం 11 గంటలకు మంత్రి స‌మావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజ‌న్ లో మిర్చి యార్డ్ నందు రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా, మిర్చి ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వ్వకుండా అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై మంత్రి చ‌ర్చించ‌నున్నారు.

Read More »

ఫిబ్రవరిలో ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరిలో 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ అన్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్మీ …

Read More »

వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం లాల్పురం, పుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, పుట్టూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలలో 10వ తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేకంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా సమీక్షించారు. ఉపాధ్యాయులు అందరూ ప్రత్యేక శ్రద్ధతో వంద రోజుల ప్రణాళిక అమలు చేసి పది …

Read More »

డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం డ్రైవర్లకు రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమం, నేత్ర పరీక్షలు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమని, రోడ్డు కండిషన్ మరియు ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని పరిమిత స్పీడ్ తో వాహనాలను …

Read More »

పొన్నూరు నియోజకవర్గంలో మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చే శంకుస్థాపన కార్యక్రమాలు 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొన్నూరు నియోజకవర్గంలోని నారాకోడూరులో ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూమ్ 32 లక్షల నిధులతో నారాకోడూరు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గానూ స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ… * నిరంతరం నారా, నందమూరి కుటుంబానికి అండగా …

Read More »

సరస్ లో సాంస్కృతిక కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ లో ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్ ను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి మంగళ వారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని చెప్పారు. సరస్ (SARAS – Sale of …

Read More »

సంక్షేమ వసతి గృహాల “స్వీకారం”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలోను, గురుకులంలోను మౌళిక వసతుల కల్పనకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా “స్వీకారం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ వసతి గృహం ‘ సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా ‘ ఉండాలనే తలంపుతో దీనిని చేపట్టడం జరిగింది. విద్యాభివృద్ధికి ‘మన బడి మన బాధ్యత’ అనే కార్యక్రమం ఇప్పటికే చేపట్టిన సంగతి తెలిసిందే. పి 4 (P4) కార్యక్రమం కింద స్వీకారం (Sweekaram) …

Read More »

అక్షయపాత్ర, జియంసి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్ల వద్ద ఆహ్లాదకరమైన, పరిశుభ్ర వాతావరణం అందించేందుకు అక్షయపాత్ర, జియంసి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయం రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల పరిసరాలు పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అక్షయపాత్ర, జిఎంసి సిబ్బంది …

Read More »

డ్రోన్ల ద్వారా కీమోఫాస్ లిక్విడ్ ని స్ప్రే

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చెరువులు, ఖాళీ స్థలాల్లో దోమలు పెరగకుండా ప్రత్యేకమైన డ్రోన్ల ద్వారా కీమోఫాస్ లిక్విడ్ ని స్ప్రే చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం నల్లచెరువులో యాంటీ లార్వా యాక్టివిటిలో భాగంగా డ్రోన్ ద్వారా చేస్తున్న స్ప్రేయింగ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ ల వారీగా ఉన్న చెరువులు, పెద్ద ఖాళీ స్థలాల్లో యాంటీ లార్వా యాక్టివిటిని మ్యాన్యువల్ గా చేయడానికి వీలు లేని ప్రాంతాల్లో డ్రోన్ల …

Read More »

మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం

బొండపల్లి, (విజయనగరం), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన బొండపల్లిలోని లక్ష్మీనారాయణ మోడరన్ రైస్ మిల్లును మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యాన్ని మర పట్టి ప్రభుత్వానికి అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. సీఎంఆర్ విషయంలో ఎందుకు వెనుకబడ్డారని నిలదీశారు. ఇప్పటికి కేవలం 17 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం …

Read More »