Breaking News

పొన్నూరు నియోజకవర్గంలో మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చే శంకుస్థాపన కార్యక్రమాలు 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పొన్నూరు నియోజకవర్గంలోని నారాకోడూరులో ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూమ్ 32 లక్షల నిధులతో నారాకోడూరు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గానూ స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
పెమ్మసాని మాట్లాడుతూ…
* నిరంతరం నారా, నందమూరి కుటుంబానికి అండగా ఉంటున్న నారాకోడూరు ప్రజలకు నా అభినందనలు
* మా వద్ద ఉన్న ఎంపీ లాడ్స్ లో ప్రతి నియోజకవర్గానికి రూ. 70 లక్షలను ప్రతీ ఏటా ఇస్తూ ఉంటాము.
* అందులో భాగంగానే ఈ ఎన్టీఆర్ కళా వేదికకు రూ. 50 లక్షలను ఎంపీ లాట్స్ కింద అందించాము.
* మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో ఒక్కోక్క స్టేట్ లో రూ.1 కోటి ఖర్చు చేస్తూ ఉన్నాము.
* ఒక్కొక్క గ్రామానికి రూ. 2 కోట్ల నిధులను తీసుకువచ్చాము అంటే మా ప్రాంతంపై ప్రజలపై ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.
* నేను, నరేంద్ర రైతు కుటుంబం నుంచి వచ్చిన వారమే.
* రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తాం. అవసరమైతే చౌహాన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కరిస్తాము. రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకొని అవసరం లేదు.
* ఇకనుంచి ఎంపీ లార్డ్స్ నుంచి ప్రతి ఏటా రూ. 2 కోట్లను పొన్నూరుకి మరో రూ.2 కోట్లు తెనాలికి ఇవ్వబోతున్నాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *