విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆదివారం విజయవాడ సమీపంలో పోరంకి నిడమానూరు రోడ్డులో మురళీ రిసార్ట్, శ్రీ ముత్తవరపు వెంకటేశ్వరరావు ప్రాంగణంలో కమ్మవారి సేవా సమితి, గ్రేటర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు అత్యద్భుతంగా జరిగాయి. ఈ వేడుకలో విశిష్ఠ అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరి, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ప్రపంచ చదరంగ విజేత కోనేరు హంపి …
Read More »Daily Archives: January 11, 2026
ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 …
Read More »వడ్డే ఓబన్నకు ఘన నివాళులర్పించిన విఎంసి సిబ్బంది
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద వడ్డే ఓబన్నకు ఘన నివాళులర్పించారు. ఆదివారం ఉదయం అడిషనల్ కమిషనర్ జనరల్ ఎ. రవీంద్ర రావు, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని, సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం, కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య …
Read More »అంబరాన్నంటిన జిఎంసి సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం
-666 మంది కళాకారుల శాస్త్రీయ నృత్యంతో సంబరాలకు స్వాగతం – ఈ నెల 16 వరకు ప్రతి రోజు ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 16 వరకు జరగనున్న సంక్రాంతి సంబరాలను ఆదివారం సాయంత్రం తెలుగుకళ ఉట్టిపడేలా, రానున్న సంబరాలు ఏ విధంగా జరుగుతాయో తెలిపేలా నాట్య గురువు ఖలీల్ నేతృత్వంలో 60 గురువుల శిక్షణలోని 666 మంది కళాకారుల శాస్త్రీయ నృత్యంతో స్వాగత …
Read More »సరస్ మేళాలో విధులు కేటాయించబడిన జిఎంసి సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళాలో విధులు కేటాయించబడిన జిఎంసి సిబ్బంది, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మేళా పరిసర ప్రాంతాల్లో అనధికార ఆక్రమణలు, షాప్ లను తక్షణం తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఆదివారం స్థానిక నల్లపాడు రోడ్ లో జరుగుతున్న సరస్ మేళాని పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సరస్ మేళాలో ఫుడ్ స్టాల్, త్రాగునీటి పాయింట్స్, పారిశుధ్య పనులు, మొబైల్ టాయ్ లెట్స్ ని పరిశీలించి, …
Read More »గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం…
-సంక్రాంతి కానుకగా 3.10 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే ఆర్&బి రోడ్లకు శంకుస్థాపన… -38 లక్షల రూపాయలతో మడికి నుండి మెర్నిపాడు వరకు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం… -నియోజకవర్గంలో వాడ వాడల అభివృద్ధి పనులు… -గ్రామాల అభివృద్ధి తన ధ్యేయమన్న ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆర్ అండ్ బి …
Read More »‘మీకోసం’ PGRSతో పాటు భూమి సమస్యలకు రెవెన్యూ క్లినిక్
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ‘మీకోసం’ PGRS కార్యక్రమంతో పాటు, భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి జనవరి 12 (సోమవారం) ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నందున, మండల స్థాయి ‘మీకోసం’కు …
Read More »సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీల
-ఈ నెల 13న రాజమహేంద్రవరంలోనీ ఎస్.కె.వి.టి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో – జిల్లా క్రీడా అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా స్థాయిలో సాంప్రదాయ క్రీడల పోటీలను స్థానిక ఎస్ కె వి డిగ్రీ కళాశాల లోన్నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డి.ఎం.ఎం. శేషగిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఆంధ్రప్రదేశ్ …
Read More »ఆదివారం కలెక్టరేట్‌లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ టి. సీతారామ మూర్తి పేర్కొన్నారు. మన …
Read More »స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకం..
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న ఉద్యమ పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. వడ్డే ఓబన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనను …
Read More »
Prajavartha Online Telugu News